3-0తో సిరిస్ క్లీన్ స్వీప్: చెన్నై టీ20లో నమోదైన గణాంకాలివే


హైదరాబాద్: పర్యాటక వెస్టిండిస్ జట్టుతో జరిగిన ముగిసిన టెస్టు, వన్డే సిరీస్‌లను గెలుచుకున్న టీమిండియా మూడు టీ20ల సిరిస్‌లో కూడా తమకు తిరుగు లేదని నిరూపించుకుంది. సొంతగడ్డపై మూడు ఫార్మాట్లలో వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించి సిరిస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన ఆఖరి టీ20లో వెస్టిండిస్‌పై 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండిస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
విండిస్ బ్యాట్స్‌మెన్లలో నికొలస్ పూరన్ (25 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించగా, డారెన్ బ్రేవో (37 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫరవాలేదనిపించాడు. అనంతరం 182 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఓపెనర్ శిఖర్ ధావన్ (62 బంతుల్లో 92; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), రిషబ్ పంత్ (38 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) భారత విజయంలో కీలకపాత్ర పోషించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతర్జాతీయ టీ20ల్లో ధావన్‌కు ఇదే అత్యధిక స్కోరు కాగా, పంత్ తొలిసారి హాఫ్ సెంచరీ సాధించాడు.
ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, కుల్దీప్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి. ఈ మ్యాచ్‌తో భారత జట్టులోని ఆటగాళ్లు పలు రికార్డులను బద్దలు కొట్టారు. అవేంటో ఒక్కసారి చూద్దాం.....

ఇది రెండోసారి
2 - భారత్ తరుపున ఓ టీ20లో ఇద్దరు ఎడమచేతివాటం బ్యాట్స్‌మెన్లు హాఫ్ సెంచరీలు సాధించడం ఇది రెండోసారి. ఈ మ్యాచ్‌లో ధావన్(92), రిషబ్ పంత్(58) పరుగులతో హాఫ్ సెంచరీలు సాధించారు. 2007లో డర్బన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన వరల్డ్ టీ20లో గౌతం గంభీర్, యువరాజ్ సింగ్‌లు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.
3 - భారత్ చివరి బంతికి టి20 మ్యాచ్ గెలవడం ఇది మూడోసారి. గతంలో ఆస్ట్రేలియాపై (సిడ్నీలో 2016, లక్ష్యం 198), బంగ్లాదేశ్‌పై (కొలంబోలో 2018, లక్ష్యం 167) భారత్ ఆఖరి బంతికే నెగ్గడం విశేషం.
3 - రెండేళ్ల క్రితం భారత గడ్డపై టి20 ప్రపంచ కప్ సాధించిన తర్వాత వెస్టిండిస్ ఉపఖండంలో ఆడిన మూడు సిరీస్‌లు కూడా 0-3తోనే ఓడిపోయింది. మూడు సిరీస్‌లు ఇలా ఓడిన ఏకైక జట్టు వెస్టిండిసే కావడం విశేషం.

3-0తో టీ20 సిరిస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా
9 - తాజా విజయం సాధించడంతో మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. తద్వారా టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో అత్యధిక సార్లు గెలిచిన జాబితాలో టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. భారత్ జట్టు మూడుసార్లు 3-0తో టీ20 సిరీస్‌ను గెలవగా, పాకిస్తాన్ ఐదుసార్లు విజయం సాధించింది. అప్ఘానిస్తాన్‌తో కలిసి భారత్ సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, యూఏఈ, వెస్టిండీస్‌లు ఒక్కోసారి మాత్రమే 3-0తో టీ20 సిరీస్‌లను గెలిచాయి.
12 - టీమిండియా వరుసగా 12 అంతర్జాతీయ టీ20ల్లో విజయం సాధించింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ భారత కెప్టెన్ అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిపించిన కెప్టెన్‌గా నిలిచాడు. 2017లో విరాట్ కోహ్లీ సైతం వరుసగా 12 టీ20ల్లో భారత జట్టుని గెలిపించాడు.

2009లో మొహాలీ వేదికగా శ్రీలంకతో
16 - ఈ సిరిస్‌లో వెస్టిండిస్ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు సమర్పించుకున్న వైడ్లు. 2009లో మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో వెస్టిండిస్ 17 వైడ్లు ఇవ్వడం విశేషం.
21 ఏళ్ల 38 రోజులు - 21 సంవత్సరాల 38 రోజుల సమయంలో భారత్ తరుపున టీ20ల్లో హాఫ్ సెంచరీ సాధించిన రెండో పిన్న వయస్కుడిగా రిషబ్ పంత్ నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ(20 సంవత్సరాల 143 రోజులు) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 2007 వరల్డ్ టీ20లో రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు.
58 - టీ20ల్లో రోహిత్ శర్మ 100 సిక్సులు బాదేందుకు తీసుకున్న ఇన్నింగ్స్‌లు. ఈ జాబితాలో ఎవిన్ లూయిస్(55), రాస్ టేలర్(57) ఇన్నింగ్స్‌లతో అతడి కంటే ముందున్నారు.

టీ20ల్లో ధావన్ అత్యధిక స్కోరు 92
92 - టీ20ల్లో శిఖర్ ధావన్ అత్యధిక స్కోరు. రిషబ్ పంత్‌తో కలిసి మూడో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతర్జాతీయ టీ20ల్లో ధావన్‌కు ఇదే అత్యధిక స్కోరు కాగా, పంత్ తొలిసారి హాఫ్ సెంచరీ సాధించాడు.
200 - ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఫోర్ బాది పెవిలియన్ చేరాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ఫోర్లు కొట్టిన రెండో భారత ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ కంటే ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ 214 ఫోర్లతో ఉండగా, రోహిత్ శర్మ పేరిట 200 ఫోర్లు ఉన్నాయి. కాగా, మొత్తంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాళ్లలో శ్రీలంక క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్(223) ముందు వరుసలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో అప్ఘన్ ఆటగాడు మొహ్మద్ షెహజాద్(218) నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో కోహ్లీ, మార్టిన్ గుప్తిల్, రోహిత్ శర్మలు ఉన్నారు. న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గుప్టిల్, రోహిత్ శర్మలు సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications