న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ప్రకారం: పృథ్వీ షానే మరో సచిన్ టెండూల్కరా?


హైదరాబాద్: పృథ్వీ షా తన అరంగేట్ర టెస్టులోనే సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్ పృథ్వీషా 99 బంతుల్లో సెంచరీ సాధించాడు. తద్వారా అరంగేట్ర టెస్టులో సెంచరీతో భారత్ తరుపున ఈ ఘనత సాధించిన 15వ ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.
దీంతో పాటు పృథ్వీ షా అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. పృథ్వీషాకు ముందు ఏ భారత టీనేజర్ కూడా టెస్టుల్లో తొలి బంతిని ఎదుర్కొనలేదు. టెస్టుల్లో తొలి బంతని ఎదుర్కొన్న పిన్న వయస్కుడిగా పృథ్వీషా అరుదైన ఘనత సాధించాడు. మొత్తంగా చూస్తే ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాట్స్‌మెన్.
సచిన్ (17 ఏళ్ల 112 రోజులు) తర్వాత టెస్టుల్లో సెంచరీ చేసిన అత్యంత చిన్న వయసు బ్యాట్స్‌మన్‌గా పృథ్వీషా అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో సెంచరీ చేసిన ఏడో అత్యంత చిన్న వయసు బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. భారత్ తరుపున అతి తక్కువ వయసులో టెస్టుల్లో అరంగేట్రం చేసిన నాలుగో బ్యాట్స్‌మన్‌గా పృథ్వీషా నిలిచాడు.
సచిన్ టెండూల్కర్ (9 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు) తర్వాత అతి తక్కువ అనుభవంతో టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టిన బ్యాట్స్‌మన్‌గా పృథ్వి షా నిలిచాడు. పృథ్వి షా కేవలం 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. గత పదేళ్లలో భారత్‌కు ఆడిన అత్యంత చిన్న వయసు ప్లేయర్ కూడా ఇతడే కావడం విశేషం.
అరంగేట్ర టెస్టులో సెంచరీ చేసిన 10వ టీనేజర్‌గా పృథ్వీషా అరుదైన ఘనత సాధించాడు. అరంగేట్ర టెస్టులో సెంచరీ సాధించిన పృథ్వీ షాపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా పృథ్వీ షా ఇన్నింగ్స్‌ను మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తున్నారు.
వీరిద్దరి రికార్డులను పోల్చిన క్రికెట్ విశ్లేషకులు న్యూమరాలజీ, ఆస్ట్రాలజీలను పరిగణనలోకి తీసుకుని పృథ్వీషాను కొత్త టెండూల్కర్‌గా పేర్కొంటున్నారు. పృథ్వీ షా-సచిన్ టెండూల్కర్‌ల మధ్య కొన్ని సారుప్యాలు మీకోసం...

ఇద్దరి ఎత్తు ఐదు అడుగులే
వీకిపిడియా.కామ్ ప్రకారం పృథ్వీ షా-సచిన్ టెండూల్కర్‌ల ఎత్తు 5 అడుగుల 5 ఇంచ్‌లు.

రంజీ, దులిప్ ట్రోఫీల్లో సెంచరీలు
సచిన్ టెండూల్కర్ తన అరంగేట్ర రంజీ, దులిప్ ట్రోఫీల్లో సెంచరీలు నమోదు చేశాడు. పృథ్వీ షా కూడా సరిగ్గా అదే విధంగా రంజీ, దులిప్ ట్రోఫీల్లో సెంచరీలు సాధించాడు.

పృథ్వీ షా పుట్టిన తేదీ నవంబర్ 9, 1999
పృథ్వీ షా పుట్టిన తేదీ నవంబర్ 9, 1999. అదే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ వన్డేల్లో 186 పరుగులు చేశాడు.

నవంబర్ 20, 2013న సచిన్ రిటైర్మెంట్
అంతర్జాతీయ క్రికెట్ నుంచి సచిన్ టెండూల్కర్ నవంబర్ 20, 2013న రిటైరయ్యాడు. ఆస్ట్రాలజీ ప్రకారం పృథ్వీ షా రాశి వృశ్చికం. పృథ్వీ షా లక్కీ నెంబర్ 4. సచిన్ టెండూల్కర్ వీడ్కులో పలికిన నాలుగు రోజుల తర్వాత ఓ స్కూల్ మ్యాచ్‌లో పృథ్వీ షా 546 పరుగులు చేశాడు. ఇదొక రికార్డు.

తొలి టెస్టులో 15 పరుగులు చేసిన సచిన్
సచిన్ టెండూల్కర్ తన తొలి టెస్టులో 15 పరుగులు చేశాడు. టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ తొలి సెంచరీ సాధించినప్పుడు చేసిన పరుగులు 119 నాటౌట్. ఈ నెంబర్లు అన్నీ కలిపితే వచ్చే నెంబర్ 134. ఈ సంఖ్య రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పృథ్వీ షా చేసిన పరుగులు. రాజ్‌కోట్ టెస్టులో పృథ్వీ షా చేసిన పరుగులు 134.

ఆస్ట్రాలజీ ప్రకారం సచిన్ రాశి వృషభం
సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు ఏప్రిల్ 24. ఆస్ట్రాలజీ ప్రకారం సచిన్ రాశి వృషభం. వృషభం నివసించేది భూమిపైన. పృథ్వీని తెలుగులోకి తర్జుమా చేస్తే వచ్చేది భూమి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications