కోహ్లీ, జడేజా సెంచరీ..: ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన టీమిండియా 649/9

హైదరాబాద్: రాజ్‌కోట్ వేదకగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తన ఇన్నింగ్స్‌ను 649/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 364/4 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
మ్యాచ్ ఆరంభంలో కోహ్లీని అనుకరించి నెమ్మదిగా ఆడిన జడేజా హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం దూకుడు పెంచాడు. ఫోర్ల, సిక్సర్లతో విరుచుకుపడి 132 బంతుల్లో సెంచరీ సాధించాడు. జడేజా సెంచరీ పూర్తయిన వెంటనే కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించాడు.
గురువారం ప్రారంభమైన తొలి టెస్టు తొలిరోజు యువ ఆటగాడు పృథ్వీషా (134) పరుగులతో సెంచరీ సాధించగా.... పుజారా (86) పరుగులతో తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రెండో రోజైన శుక్రవారం విరాట్ కోహ్లీ(137) సెంచరీ చేశాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 24వ సెంచరీ. ఈ ఏడాది టెస్టుల్లో కోహ్లీకి ఇది నాలుగో సెంచరీ.

అనేక రికార్డులు నమోదు
ఈ సెంచరీతో కోహ్లీ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. 123 ఇన్నింగ్స్‌ల్లో 24వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ తర్వాత అత్యంత వేగంగా 24 టెస్టు సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 125 ఇన్నింగ్స్‌ల్లో సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీకి ఇది 50వ సెంచరీ.

కోహ్లీ ఖాతాలో మరో మైలురాయి
కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టక ముందు 250 ఇన్నింగ్స్‌ల్లో 29 సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా 134 ఇన్నింగ్స్‌ల్లోనే 30 సెంచరీలు సాధించడం విశేషం. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఖాతాలో మరో మైలురాయి వచ్చి చేరింది. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లలో అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ రెండోస్థానానికి చేరుకున్నాడు.

టెస్టుల్లో వరుసగా మూడో ఏడాది వెయ్యి పరుగులు
23 సెంచరీలు చేసిన స్టీవ్ స్మిత్‌ను వెనక్కి నెట్టిన విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీం ఆమ్లా (29) తర్వాతి స్థానంలో నిలిచాడు. ఫలితంగా సొంతగడ్డపై అత్యంత వేగంగా మూడు వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా పుజారా సరసన నిలిచాడు. దీంతో పాటు తాజా సెంచరీతో ఈ ఏడాది టెస్టుల్లో వెయ్యి పరుగులను పూర్తి చేసుకున్నాడు.
తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ చరిత్ర
వరుసగా మూడో ఏడాది టెస్టుల్లో వెయ్యి పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. కోహ్లీ సెంచరీ చేయగా, రిషబ్ పంత్(92) చేజార్చుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా ఆచితూచి ఆడాడు. ఆరో వికెట్‌కు 64 పరుగులు జోడించిననంతరం కోహ్లీ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది.
649/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా
కుల్దీప్(12), ఉమేశ్ యాదవ్(22), మహ్మద్ షమీ(2 నాటౌట్)ల సాయంతో ఆచితూచి ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 132 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. రవీంద్ర జడేజా సెంచరీ అనంతరం కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను 649/9 వద్ద డిక్లేర్ చేసి పర్యాటక వెస్టిండిస్ జట్టుని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. వెస్టిండిస్ బౌలర్లలో దేవేంద్ర బిషు నాలుగు వికెట్లు తీసుకోగా, లూయిస్ 2, గాబ్రియేల్, రోస్టన్ చేజ్, క్రెయిగ్ బ్రాత్‌వైట్ తలో వికెట్ తీసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications