Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Westindies: గాయపడ్డ రోహిత్‌కు రెస్ట్ అవసరం..! మిగతా రెండు టీ20లకు భారత కెప్టెన్ ఎవరు..?

India Vs Westindies : Who is the Captain to Teamindia for Next Two T20 Matches

సెయింట్ కిట్స్: భారత క్రికెట్ అభిమానులకు షాక్ తగిలేలా ఉంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన మూడో టీ20లో ఓపెనర్‌గా బరిలోకి దిగి అనూహ్యంగా రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. తన ట్రేడ్‌మార్క్ పుల్ షాట్‌తో సిక్సర్ బాదిన హిట్ మ్యాన్.. ఆ వెంటనే బౌండరీ కూడా కొట్టి టచ్‌లోకి వచ్చాడు. రెండు బంతులను లెగ్ సైడ్ స్వీప్ షాట్‌ కొట్టడానికి ప్రయత్నించిన రోహిత్‌కు వీపు కండరాలు పట్టేశాయి. బీసీసీఐ సైతం బ్యాక్ స్పామ్ ప్రాబ్లంతో రోహిత్ రిటైర్డ్ హార్ట్‌ అయ్యాడని ప్రకటించింది. మ్యాచ్ టైంలోనే చాలా అసౌకర్యంగా కనిపించిన రోహిత్.. నొప్పితో అల్లాడిపోయాడు. శరీరాన్ని బలంగా ఒకే వైపు తిప్పడంతో ఈ గాయం అయినట్లు తెలుస్తోంది. వెంటనే ఫిజియోలు పరీక్షించి అతన్ని డగౌట్‌కు తీసుకెళ్లారు.

సరైన రెస్ట్ అవసరమనే సంకేతాలు

సరైన రెస్ట్ అవసరమనే సంకేతాలు

రోహిత్ 5 బంతుల్లో 11పరుగులకే రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరగడం వల్ల అతను ఈ సిరీస్లో మిగితా రెండు మ్యాచ్‌లకు ఆడడం సందేహమే. రోహిత్ నొప్పి తీవ్రత అలాగే అతని ఫిట్ నెస్ స్థాయిలపై సందేహాలు తీవ్రమయ్యాయి. అందువల్ల రోహిత్‌కు చికిత్స, శిక్షణ నిమిత్తం ప్రాపర్ రెస్ట్ అవసరమనే సంకేతాలున్నాయి. ఇదే జరిగితే మిగితా రెండు మ్యాచ్‌లకు భారత్‌ను నడిపించబోయే లీడర్ ఎవరనే విషయంలో కాస్త ఉత్కంఠ నెలకొంది.

కేఎల్ రాహుల్ గైర్హాజరీతో

కేఎల్ రాహుల్ గైర్హాజరీతో

ఈ సిరీస్‌కు భారత స్క్వాడ్‌లో రిషబ్ పంత్, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా లాంటి కెప్టెన్సీ వహించదగ్గ ప్లేయర్లు ఎంపికైన సంగతి తెలిసిందే. రోహిత్ మిస్సయితే దక్షిణాఫ్రికా సిరీస్లో కెప్టెన్సీ వహించిన రిషబ్ పంత్, ఐర్లాండ్ మీద కెప్టెన్సీ వహించిన హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ రేసులో ముందున్నారు. ఇకపోతే ఈ సిరీస్‌కు ఎంపికైన స్క్వాడ్‌లో కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కానీ ఈ సిరీస్‌కు ముందు కరోనా బారినపడడం, పూర్తి ఫిట్ నెస్ సాధించకపోవడంతో అతని స్థానంలో సంజూ శాంసన్ ఎంపికయ్యాడు.

కెప్టెన్‌గా అతను.. వైస్ కెప్టెన్‌గా ఇతను

కెప్టెన్‌గా అతను.. వైస్ కెప్టెన్‌గా ఇతను

ఇక కేఎల్ రాహుల్ గైర్హాజరీలో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా ప్రతి మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యాను టీమిండియా మేనేజ్ మెంట్ ప్రకటించింది. హార్దిక్ పాండ్యా ఐపీఎల్లో, ఐర్లాండ్ పర్యటనలో సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. రిషబ్ పంత్‌ను కేవలం వికెట్ కీపర్‌గా మాత్రమే పేర్కొంది. దీన్ని బట్టి రోహిత్ అందుబాటులో లేకుంటే టీమిండియా పగ్గాలు చేపట్టేది హార్దిక్ పాండ్యా అని స్పష్టమవుతుంది. హార్దిక్ సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉండడం ఇందుక్కారణం.. వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను లేదంటే భువీని పేర్కొనవచ్చు.

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన జట్టు ఇదే

రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), దీపక్ హుడా, దినేష్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, హర్షల్ పటేల్, రవీంద్ర జడేజా

Story first published: Wednesday, August 3, 2022, 11:40 [IST]
Other articles published on Aug 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+