అదే మా ఓటమిని శాసించింది.. రెండో టీ20లో ఓటమి పట్ల రోహిత్ వ్యాఖ్యలు

సెయింట్ కిట్స్: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ పరాజయం పాలయిన సంగతి తెలిసిందే. సోమవారం అనూహ్యంగా మ్యాచ్ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 5వికెట్ల తేడాతో గెలిచి ఐదు టీ20ల సిరీస్‌లో 1-1తో సమం చేసి రేసులోకి వచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత ఓటమికి బ్యాటింగ్ వైఫల్యం ప్రధాన కారణమని అర్థమవుతుండగా.. మరో కారణం చివరి ఓవర్లో అవేశ్ ఖాన్ నో బాల్ వేయడం అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్‌లో తొలుత భారత్ 138 పరుగులకే కుప్పకూలింది.
హార్దిక్ పాండ్యా (31 బంతుల్లో 31), రవీంద్ర జడేజా(30 బంతుల్లో 27) మినహా మిగతా వారు రాణించలేదు. వెస్టిండీస్ బౌలర్ ఒబెడ్ మెక్‌కాయ్ (6/17) సిక్స్ వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించాడు. తర్వాత వెస్టిండీస్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసి గెలుపొందింది. ఇక ఈ మ్యాచ్ ఓటమికి గల కారణాలను రోహిత్ శర్మ వెల్లడించాడు.

పిచ్ బానే ఉంది కానీ..
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. 'స్కోరుబోర్డుపై తగినంత పరుగులు మేం చేయలేదు. మేం తొలుత బ్యాటింగ్‌లో ఫెయిలయ్యాం. పిచ్ చక్కగా ఉంది. కానీ మేమే రాణించలేదు. బ్యాటింగ్ వైఫల్యమే మా ఓటమిని శాసించింది. కానీ ఇలాంటివి జరగవచ్చు. మీరు బ్యాటింగ్ పరంగా ఓ అప్రోచ్ విషయమై ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఎప్పుడూ విజయవంతం కాకపోవచ్చు. కానీ మేము దీని నుంచి నేర్చుకుంటున్నాము.'

అందుకే భువీకి బదులు అవేశ్ ఖాన్
'కొత్త కుర్రాళ్లకు అవకాశాలు కల్పించాలనేది నా ఉద్దేశం. చివరి ఓవర్లో భువీ ఉంటే అతను టీం కోసం ఏమి చేసేవాడో మనకు తెలిసిందే. అతను సంవత్సరాలుగా డెత్ ఓవర్లలో ఎంతో గొప్ప బౌలింగ్ వేస్తున్నాడు. నా ప్రకారం.. అవేష్, అర్ష్‌దీప్ లాంటి వాళ్లకు అవకాశాలు ఇస్తే తప్ప మీకు వాళ్ల సత్తా ఏంటో ఎప్పటికీ తెలియదు. కానీ ఇది కేవలం ఒక గేమ్ మాత్రమే. అవేశ్ ఖాన్ విఫలమైనంత మాత్రాన అతన్ని తక్కువ అంచనా వేయలేము. కొత్త కుర్రాళ్లలో నైపుణ్యాలు, మంచి ప్రతిభ దాగి ఉంది. వారికి మద్దతుగా నిలుస్తూనే ఉంటాం. '

బ్యాటింగ్లో మాకు కావాల్సిన విధానమిదే
ఏదేమైనా మా బౌలర్లు, టీం ప్రదర్శన గురించి నేను నిజంగా గర్వపడుతున్నాను. ఇలాంటి లక్ష్యాలను 13-14ఓవర్లలోనే ఛేదించేయొచ్చు. కానీ మేము దానిని చివరి ఓవర్ వరకు లాగగలిగాము. మా టీంమేట్స్ మా ప్రణాళికలను చక్కగా అమలు చేశారు. మా బౌలింగ్ విధానం పట్ల కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఇక బ్యాటింగ్‌లో కొన్ని అంశాలను చూడాలి. కానీ నేను మళ్లీ మళ్లీ చెబుతుందేంటంటే.. బ్యాట్‌తో మాకు కావాల్సిన విధానం ఇదే. మేము నిర్భయంగా ఆడాలి. ఒక ఓటమి తర్వాత మా అప్రోచ్ మార్చబోము.

తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్
వెస్టిండీస్: కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్(కీపర్), రోవ్‌మన్ పోవెల్, షిమ్రన్ హెట్‌మైర్, డేవన్ థామస్, జాసన్ హోల్డర్, అకీల్ హోస్సెన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications