India vs WestIndies : ఇండియాదే బ్యాటింగ్.. రవీంద్రా జడేజా ఔట్.. తుది జట్టులో ఎవరెవరంటే..?

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : టీమిండియా కరేబియన్ గడ్డపై కాలుదువ్వడానికి సిద్ధమైంది. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి మ్యాచ్‌కు ఇండియా రెడీ అయింది. ఇక టీమిండియా స్టార్ ఆటగాళ్లు లేనప్పటికీ.. జట్టు పటిష్ఠంగానే కన్పిస్తుంది. ఇక ఈ సిరీస్ భారత కుర్రాళ్ల సత్తాను పరీక్షించడానికి సరైన వేదిక అని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. కెప్టెన్ రోహిత్, కోహ్లీ, హార్దిక్, పంత్, షమీ, బుమ్రా ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్నారు. శిఖర్ ధావన్ జట్టును నడిపించబోతున్నాడు. ధావన్ కెప్టెన్సీలో యువ ప్లేయర్లు ఈ సిరీస్‌ను ఎలా నెగ్గుకొస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.
ఇకపోతే మ్యాచ్‌లన్నీ ఇండియా టైమింగ్ ప్రకారం.. రాత్రి 7గంటలకు ప్రారంభమై వేకువజామున 3.30కు ముగుస్తాయి. దీంతో మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఇండియా అభిమానులు తెల్లార్లు మేల్కొని చూడాల్సిందే. ఈ మ్యాచ్ డీడీ స్పోర్ట్స్‌లో, ఫ్యాన్ కోడ్ యాప్ లేదా వెబ్ సైట్లో చూడొచ్చు. గాయం కారణంగా భారత స్టార్ ఆల్రౌండర్, ప్రస్తుత వైస్ కెప్టెన్ రవీంద్రా జడేజా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.

కోవిడ్ వల్ల జాసన్ హోల్డర్ ఔట్
ఇక ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు టాస్ కోసం గ్రౌండ్లోకి వచ్చారు. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక అతను మాట్లాడుతూ.. 'వాతావరణం, టైం బట్టి తొలుత బౌలింగ్ ఎంచుకోవడమే రైట్ అన్పించింది. టాస్ గెలిచినందుకు సంతోషంగా ఉంది. నా హోమ్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ ఆడనుండడం సంతోషంగా ఉంది.
మేము మంచి భాగస్వామ్యాలను నమోదు చేయాలని చూస్తున్నాము. బంగ్లా సిరీస్లో ఓటమి అనంతరం మమ్మల్ని మేము మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. జాసన్ హోల్డర్ కరోనా బారిన పడ్డాడు కాబట్టి ఆడట్లేదు. కైల్ మేయర్స్ గాయం నుండి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు. బంగ్లాదేశ్ సిరీస్‌లో ఎవరైతే ఆడారో వాళ్లందరూ ప్రస్తుత తుది జట్టులో ఉన్నారు.' అని పేర్కొన్నాడు.

నేను చాలా కూల్ కెప్టెన్‌ను
టాస్ ఓడిన శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. మేము ఛేజింగ్ చేయాలనుకున్నాం. వికెట్ చాలా ప్యాచీగా ఉంది. వర్షం కూడా పడుతోంది. కానీ మేము తొలుత బ్యాటింగ్ చేయడానికి అయినా ఓకే. నేను చాలా కూల్ కెప్టెన్‌ని. నా ఎనర్జీని కొనసాగించాలని ఆశిస్తున్నాను. మంచి నిర్ణయాలు తీసుకుని, విన్నింగ్ ప్రాసెస్ నమ్ముకుంటాను.
మా జట్టు తరఫున యువకులు ప్రతిభను ప్రదర్శించడానికి, పోరాటాన్ని ప్రదర్శించడానికి, సిరీస్‌ను గెలవడానికి ఇది గొప్ప అవకాశం. సూర్య, శ్రేయాస్, శాంసన్ అందరూ బావున్నారు. నేను కూడా ఫాంలోనే ఉన్నా. ఇక్కడ స్టేడియంలో స్థానికుల నుంచి లభిస్తున్న మద్దతుకు సంతోషంగా ఉంది.

తుది జట్లు :
భారత్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్ ( కెప్టెన్ ), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షాయ్ హోప్ ( వికెట్ కీపర్ ), బ్రాండన్ కింగ్, షమర్ బ్రూక్స్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, అకేల్ హోసేన్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications