India vs WestIndies : అవేశ్ ఖాన్ అరంగేట్రం.. అందుకే బ్యాటింగ్ ఎంచుకున్న పూరన్.. టీమిండియా తుదిజట్టు..!

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం చివరి ఓవర్ వరకు జరిగిన తొలి మ్యాచ్‌లో ఇండియా ఉత్కంఠరీతిలో గెలుపొందిన సంగతి తెలిసిందే. కెప్టెన్ రోహిత్, కోహ్లీ, హార్దిక్, పంత్, షమీ, బుమ్రా లాంటి స్టార్ ప్లేయర్లు లేకున్నా.. శిఖర్ ధావన్ యువ జట్టును సమర్థంగా నడిపిస్తున్నాడు. తొలి మ్యాచ్ చివరి ఓవర్లో సిరాజ్ కట్టుదిట్టమైన బౌలింగ్, సంజూ శాంసన్ డైవ్ చేసి ఫోర్ ఆపడం ఇండియా విజయానికి ప్రధాన కారణాలయ్యాయి. ఇక రెండో మ్యాచ్‌లో ఇండియా.. వెస్టిండీస్‌పై సాధికారిక విజయం సాధించాలని చూస్తుండగా.. వెస్టిండీస్ మాత్రం ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ కోల్పోకుండా చూడాలని చూస్తుంది. ఈ మ్యాచ్ ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్లో వెస్టిండీస్ టైం ప్రకారం.. ఉదయం 9.30కు ప్రారంభం కానుండగా.. ఇండియా టైమింగ్ ప్రకారం రాత్రి 7గంటలకు ప్రారంభమై వేకువజామున 3.30కు ముగుస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ అవేశ్ ఖాన్ వన్డేల్లో అరంగేట్రం చేయబోతుండడం విశేషం.
అన్ని పరుగులు చేస్తే మాకు ఎడ్జ్ ఉంటుంది
ఇక రెండో వన్డేకు ముందు ఇరు జట్ల కెప్టెన్లు టాస్ కోసం గ్రౌండ్లోకి వచ్చారు. వరుసగా రెండోసారి టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో బౌలింగ్ ఎంచుకున్న పూరన్.. ఈసారి బ్యాటింగ్ ఎంచుకోవడం గురించి నికోలస్ పూరన్ మాట్లాడుతూ.. ఈ వికెట్ మీద చివరిసారి ఆడినప్పుడు 250 పరుగులు చేయడం సవాలుగా అనిపించింది. మేము తొలుత బ్యాటింగ్ చేసి మంచి భాగస్వామ్యాలను నిర్మించి ఆ మేరకు పరుగులు చేయాలి. తద్వారా మ్యాచ్ గెలవడానికి మాకు ఎడ్జ్ ఉంటుంది. ఈ మ్యాచ్‌లో మోతీ తప్పకున్నాడు. అతని స్థానంలో హేడెన్ ఆడుతున్నాడు.' అని పూరన్ తెలిపాడు.
బౌలింగ్లో కాస్త మెరుగు కావాలి
టాస్ ఓడిన ఇండియా కెప్టెన్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. పిచ్ చాలా బాగుంది.. స్పిన్‌కు అనుకూలించే వరకు బౌలింగ్ పరంగా మాకు బానే వర్కౌట్ అయ్యేలా ఉంది. చివరి గేమ్ ఎలా ఆడామో దానికంటే కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. గత మ్యాచులో మేము ఫీల్డింగ్ టైంలో కొన్ని పరుగులు ఇచ్చాం. మా బౌలింగ్‌లో 5-10% మెరుగుదల కూడా అవసరం. అన్ని చర్చించుకున్నాం. సిరాజ్ వేసిన యార్కర్లు, ప్రసిద్ ఒత్తిడిని అదుపు చేయడం ఆకట్టుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో ప్రసిద్ తప్పుకున్నాడు. అతని స్థానంలో అవేష్ ఖాన్ అరంగేట్రం చేయబోతున్నాడు.' అని ధావన్ చెప్పాడు.
తుది జట్లు :
భారత ప్లేయింగ్ XI: 1.శిఖర్ ధావన్ (కెప్టెన్), 2.శుభ్‌మన్ గిల్, 3 శ్రేయాస్ అయ్యర్, 4.సూర్యకుమార్ యాదవ్, 5.సంజు శాంసన్ (వికెట్ కీపర్), 6.దీపక్ హుడా, 7.అక్షర్ పటేల్, 8.శార్దూల్ ఠాకూర్, 9.మహ్మద్ సిరాజ్, 10.చాహల్, 11.అవేష్ ఖాన్.
వెస్టిండీస్ ప్లేయింగ్ XI: 1.షాయ్ హోప్ (వికెట్ కీపర్), 2.కైల్ మేయర్స్, 3.షమర్ బ్రూక్స్, 4.బ్రాండన్ కింగ్, 5.నికోలస్ పూరన్ (కెప్టెన్), 6.రోవ్‌మాన్ పావెల్, 7.రొమారియో షెపర్డ్, 8.అకేల్ హోసేన్, 9.హేడెన్ వాల్ష్, 10.అల్జారీ జోసెఫ్, 11.జేడెన్ సీల్స్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications