
వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్లో భాగంగా జరిగిన తొలి టీ20లో ఇండియా 68పరుగుల భారీ తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్ బ్యాటింగ్లో అదరగొట్టారు. వారికి తోడు స్పిన్నర్లు, పేసర్లు బౌలింగ్లో చెలరేగడంతో ఇండియా సునాయసంగా గెలిచింది. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన డీకే 19బంతుల్లో 41పరుగులు చేయడంతో ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల భారీ స్కోరు చేసింది. తర్వాత వెస్టిండీస్ ఛేదనలో కేవలం 122పరుగులకే పరిమితమైంది.
ఇక సోమవారం రెండో టీ20 మ్యాచ్ సెయింట్‌కిట్స్‌లోని బస్సెటెర్రేలోని వార్నర్ పార్క్‌లో జరగనుంది. ఇకపోతే వెస్టిండీస్ వర్సెస్ భారత్ మధ్య ఇప్పటివరకు 21 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. అందులో వెస్టిండీస్ ఆరు మ్యాచ్‌లు మాత్రమే గెలవగా.. టీమిండియా 14సార్లు గెలుపొందింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. వెస్టిండీస్‌లో రెండు జట్లు ఐదు మ్యాచ్‌ల్లో తలపడగా వెస్టిండీస్ రెండుసార్లు, భారత్ మూడుసార్లు గెలిచాయి. 2వ టీ20కి ముందు ప్లేయర్లను కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి.
57 పరుగులు - టీ20ల్లో 3500పరుగులకు చేరుకోవడానికి రోహిత్ శర్మ (3443)కి మరో 57పరుగులు అవసరం.
1 వికెట్ - రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20ల్లో 50వికెట్ల మైలురాయిని చేరుకోవడానికి ఒక వికెట్ దూరంలో ఉన్నాడు.
5 ఫోర్లు - నికోలస్ పూరన్ టీ20Iలలో 100ఫోర్లు బాదడానికి మరో ఐదు ఫోర్లు బాదాలి.
44 పరుగులు - రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్‌లలో కలిపి 16000పరుగుల మైలురాయిని చేరుకోవడానికి 44పరుగులు చేయాలి.
35 పరుగులు - షిమ్రాన్ హెట్‌మెయర్ అన్ని ఫార్మాట్‌లలో కలిపి 3000పరుగులకు చేరుకోవడానికి 35పరుగుల దూరంలో ఉన్నాడు.
2 వికెట్లు - హార్దిక్ పాండ్యా టీ20Iలలో 50వికెట్లు తీయడానికి రెండు వికెట్లు అవసరం.
69 పరుగులు - శ్రేయాస్ అయ్యర్ టీ20Iలలో 1000పరుగులు పూర్తి చేయడానికి 69 పరుగులు చేయాలి. అన్ని ఫార్మాట్‌లలో కలిపి 2500పరుగులు చేయడానికి 39పరుగుల దూరంలో ఉన్నాడు.
5 ఫోర్లు - అంతర్జాతీయ క్రికెట్‌లో 100 ఫోర్లు పూర్తి చేయడానికి కింగ్ (95) ఐదు ఫోర్ల దూరంలో ఉన్నాడు.
4 వికెట్లు - ఆల్జారీ జోసెఫ్ 150వికెట్లు సాధించడానికి 4 వికెట్లు తీయాలి.
5 ఫోర్లు - అంతర్జాతీయ క్రికెట్‌లో 100ఫోర్లు పూర్తి చేయడానికి సూర్యకుమార్ యాదవ్ (95)కు ఐదు ఫోర్లు అవసరం.