India vs WestIndies : ముందు రోహిత్ ప్రదర్శన.. తర్వాత డీకే ప్రకంపన.. విండీస్ ముందు భారీ టార్గెట్

వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరుగుతున్న తొలి టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఏకంగా ముగ్గురు స్పిన్నర్లయిన రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్‌లను బరిలోకి దించి రోహిత్ శర్మ పెద్ద ప్రయోగమే చేశాడు. ఇకపోతే టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఇండియా బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 190పరుగుల భారీ స్కోరు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ (64పరుగులు 44బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) చెలరేగి ఆడగా.. చివర్లో దినేష్ కార్తీక్ (41పరుగులు 19బంతుల్లో 4ఫోర్లు, సిక్సర్ నాటౌట్) మాస్ ఫినిషింగ్‌తో అదరగొట్టాడు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 2, ఒబెడ్ మెక్కాయ్, జాసన్ హోల్డర్, అకెట్ హోసెన్, కీమో పాల్ తలా ఓ వికెట్ తీశారు.

శుభారంభం దక్కినా.. మిడిలార్డర్ అంతంతమాత్రం
బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు శుభారంభం దక్కింది. అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్‌గా రోహిత్‌తో కలిసి బరిలోకి దిగాడు. ఒబెడ్ మెక్కాయ్ వేసిన తొలి ఓవర్లోనే ఫోర్ కొట్టి సూర్య తన దంచుడు మొదలెట్టగా.. హోల్డర్ వేసిన 2వ ఓవర్లో సిక్స్ కొట్టి తన దూకుడు ప్రారంభించాడు. వీరిద్దరు ఇక 4వ ఓవర్లో సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ ఓవర్ అల్జారీ జోసెఫ్ వేయగా.. ఒక సిక్స్, రెండు ఫోర్లు కొట్టి మొత్తం ఆ ఓవర్లో 18పరుగులు పిండుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని అకెల్ హోసెన్ విడదీశాడు. సూర్యకుమార్ యాదవ్ (24పరుగులు 16బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సర్) క్యాచ్ ఔటవ్వడంతో 44పరుగులకు భారత్ తొలి వికెట్ కోల్పోయింది.

తొలుత ఆచితూచి.. తర్వాత అదిరిపోయేలా ఆడిన డీకే
తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యార్ (0) డకౌట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన మిడిలార్డర్ బ్యాటర్లు పంత్ (14), హార్దిక్ పాండ్యా (1) నిలదొక్కుకోకున్నా.. రోహిత్ మాత్రం తన హిట్టింగ్ ఆపలేదు. దీంతో స్కోరు బోర్డు మాత్రం యథావిధిగా సాగింది. 16వ ఓవర్ వరకు రోహిత్ పోరాటం కొనసాగింది. హోల్డర్ బౌలింగ్లో రోహిత్ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి ఫినిషర్ దినేష్ కార్తీక్ బరిలోకి దిగాడు. జడేజా (16)పరుగులు కుదురుకున్నట్లే కన్పించి క్యాచ్ ఔటయినా.. దినేష్ కార్తీక్ మాత్రం తొలి పది బంతుల్లో కాస్త ఆచితూచి ఆడాడు. అశ్విన్ (13)సైతం అతనికి సపోర్ట్‌గా నిలిచాడు. ఇక చివరి రెండు ఓవర్లలో దినేష్ కార్తీక్ వీరవిహారం చేశాడు. హోల్డర్ వేసిన 19వ ఓవర్లో అశ్విన్ ఓ సిక్స్ బాదగా.. డీకే సిక్స్, ఫోర్ బాదాడు. ఆ ఓవర్లో ఏకంగా 21పరుగులొచ్చాయి. ఆ తర్వాత చివరి ఓవర్లోనూ డీకే తన ప్రతాపాన్ని కొనసాగించాడు. మెక్కాయ్ వేసిన ఆ ఓవర్లో ఓ సిక్స్, రెండు ఫోర్లు బాది 15పరుగులు పిండుకున్నాడు. దీంతో స్కోరు 190కి చేరుకుంది. ఇక 191పరుగుల భారీ లక్ష్యాన్ని ఇండియా డిఫెండ్ చేసుకుంటుందో లేదో చూడాలి.

తుది జట్లు
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షమర్ బ్రూక్స్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్ కం కెప్టెన్), కైల్ మేయర్స్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్, కీమో పాల్
భారత్ : 1.రోహిత్ శర్మ (కెప్టెన్), 2.రిషబ్ పంత్ (వికెట్ కీపర్), 3.శ్రేయాస్ అయ్యర్, 4.సూర్యకుమార్ యాదవ్, 5.హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), 6.దినేష్ కార్తీక్, 7.రవీంద్ర జడేజా, 8. రవి బిష్ణోయ్, 9.భువనేశ్వర్ కుమార్, 10.ఆర్ అశ్విన్, 11.అర్ష్‌దీప్ సింగ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications