India vs WestIndies : మనదే బ్యాటింగ్.. ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి.. అర్షదీప్ సింగ్ జట్టులో..!

వెస్టిండీస్ గడ్డపై జోరు మీదున్న టీమిండియా మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా ఇటీవలే మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసి వెస్టిండీస్‌కు తమ జట్టు సత్తా ఏంటో రుచి చూపించగా.. అదే జోరుతో ఐదు టీ20ల సిరీస్‌కు భారత్ సిద్ధమైంది. ఇక శుక్రవారం జరగనున్న తొలి టీ20లో విండీస్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సిరీస్‌లో భారత జట్టును పూర్తిస్థాయి కెప్టెన్ రోహిత్ శర్మ లీడ్ చేయనున్నాడు. అలాగే హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, భువనేశ్వర్ లాంటి సీనియర్ ఆటగాళ్లు బరిలోకి దిగబోతుండడంతో మ్యాచ్ పరంగా మంచి ఆసక్తి నెలకొంది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఏకంగా ముగ్గురు స్పిన్నర్లను రోహిత్ బరిలోకి దించాడు. రవీంద్రా జడేజా, రవి బిష్ణోయ్, రవిచంద్రన్ అశ్విన్ ఆడుతున్నారు. అలాగే వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. వన్డే సిరీస్లో బెంచ్‌కే పరిమితమైన అర్షదీప్ సింగ్ సైతం జట్టులోకి వచ్చాడు.

వికెట్ ఎలా ఉందో తెలుసుకోవాలని
ఈ మ్యాచ్ టాస్ కోసం ఇరు జట్ల కెప్టెన్లు టాస్ కోసం గ్రౌండ్లోకి వచ్చారు. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. అతను మాట్లాడుతూ.. ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. బహుశా పిచ్ వికెట్‌కు అనుకూలంగా అనిపిస్తుంది. అందువల్ల ఎంత ఛేజింగ్ చేయాలో తెలుసుకుంటే బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ సిరీస్ కోసం చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నాం. మేము టీ20 సిరీస్ వినోదాన్ని ఇష్టపడతాం. అల్జారీ జోసెఫ్ అరంగేట్రం చేస్తున్నాడు. షిమ్రాన్ హెట్మెయర్ తిరిగి జట్టులోకి వచ్చాడు.' అని పూరన్ చెప్పాడు.

మేం రెడీగా ఉన్నాం
టాస్ ఓడిన రోహిత్ మాట్లాడుతూ.. మేం బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉన్నాం. ఈ సిరీస్ ప్రారంభించేందుకు చాలా ఉత్సాహంగా ఉంది. మొదటి మ్యాచ్ ఇక్కడ జరగడం సంతోషకరం.. ఎందుకంటే భారత అభిమానులు స్టేడియానికి పెద్ద సంఖ్యలో రావడం చాలా బాగుంది. అన్ని సౌకర్యాలు బేషుగ్గా ఉన్నాయి. మరి వికెట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇకపోతే వన్డే సిరీస్లో ఆడిన కొందరు గాయ్స్ వెళ్లిపోయారు, కొంతమంది తిరిగి వచ్చారు. ఏదేమైనా ఈ మ్యాచ్ మాకు అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నా' అని రోహిత్ చెప్పాడు.

తుది జట్లు
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షమర్ బ్రూక్స్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్ కం కెప్టెన్), కైల్ మేయర్స్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్, కీమో పాల్
భారత్ : 1.రోహిత్ శర్మ (కెప్టెన్), 2.రిషబ్ పంత్ (వికెట్ కీపర్), 3.శ్రేయాస్ అయ్యర్, 4.సూర్యకుమార్ యాదవ్, 5.హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), 6.దినేష్ కార్తీక్, 7.రవీంద్ర జడేజా, 8. రవి బిష్ణోయ్, 9.భువనేశ్వర్ కుమార్, 10.ఆర్ అశ్విన్, 11.అర్ష్‌దీప్ సింగ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications