
ఫ్లోరిడా : వెస్టిండీస్ గడ్డపై టీమిండియా చివరి రసవత్తర పోరుకు సిద్ధమైంది. రోహిత్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే 5టీ20ల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అదే జోరుతో ఐదవ టీ20కి భారత్ సిద్ధమైంది. ఈ మ్యాచ్‌కు భారత జట్టును పూర్తిస్థాయి కెప్టెన్ రోహిత్ శర్మ కాకుండా వైస్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా లీడ్ చేయనుండడం గమనార్హం. ఈ మ్యాచులో కెప్టెన్ రోహిత్‌తో సహా సీనియర్ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చారు. మొత్తం నాలుగు మార్పులతో టీమిండియా బరిలోకి దిగనుంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, భువనేశ్వర్ బెంచ్ పై కూర్చున్నారు. ఇక ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యార్, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు. గత మ్యాచులో బెంచ్‌కు పరిమితమైన హార్దిక్ పాండ్యా చివరి మ్యాచులో కెప్టెన్సీ పగ్గాలు చేపడుతున్నాడు. ఈ మ్యాచ్ టాస్ కోసం ఇరు జట్ల కెప్టెన్లు టాస్ కోసం గ్రౌండ్లోకి రాగా.. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గ కారణాలు అతను పేర్కొన్నాడు.
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI) : షమర్ బ్రూక్స్, షిమ్రాన్ హెట్మెయర్, నికోలస్ పూరన్ ( కెప్టెన్ ), డెవాన్ థామస్ ( వికెట్ కీపర్ ), జాసన్ హోల్డర్, ఓడియన్ స్మిత్, కీమో పాల్, డొమినిక్ డ్రేక్స్, ఒబెడ్ మెక్‌కాయ్, హేడెన్ వాల్ష్, రోవ్‌మన్ పావెల్
భారత్ (ప్లేయింగ్ XI) : ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్