Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs WestIndies: ముగ్గురు ‘రవి’ల ప్రయోగం సక్సెస్.. తొలి టీ20లో ఇండియా విన్నింగ్ బై స్పిన్నింగ్..!

India vs WestIndies T20 Series : As Three Spinners Strikes India Lead the series with 1-0

వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌‌‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో 1-0తేడాతో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున స్పిన్నర్లయిన ముగ్గురు 'రవి'లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్‌లను బరిలోకి దించి రోహిత్ శర్మ చేసిన ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయింది. రవికాంతులు చిందే బంతులతో వీరి స్పిన్నింగ్ ధాటికి వెస్టిండీస్ జట్టు మలమల మాడిపోయింది.

అశ్విన్, బిష్ణోయ్ తలా రెండు వికెట్లు తీయగా.. జడేజా ఒక వికెట్ తీసి వెస్టిండీస్ పతనాన్ని శాసించారు. వీరికి తోడు భువీ 1, అర్షదీప్ రెండు వికెట్లు తీసి విండీస్‌కు కళ్లెం వేశారు. తద్వారా 191పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆ జట్టు 8వికెట్లు కోల్పోయి 122పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా ఇండియా 68పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దినేష్ కార్తీక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

తొలుత రోహిత్, డీకే దంచడంతో

తొలుత రోహిత్, డీకే దంచడంతో

ఇకపోతే టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఇండియా బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 190పరుగుల భారీ స్కోరు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ (64పరుగులు 44బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. చివర్లో దినేష్ కార్తీక్ (41పరుగులు 19బంతుల్లో 4ఫోర్లు, సిక్సర్ నాటౌట్) మాస్ ఫినిషింగ్‌తో అదరగొట్టాడు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 2, ఒబెడ్ మెక్కాయ్, జాసన్ హోల్డర్, అకెట్ హోసెన్, కీమో పాల్ తలా ఓ వికెట్ తీశారు.

 పెద్దగా ఎవరూ ఆడలేదు

పెద్దగా ఎవరూ ఆడలేదు

తర్వాత ఛేదనకు దిగిన విండీస్‌కు శుభారంభం దక్కలే. భువీ వేసిన తొలి ఓవర్లో ఓపెనర్లు మేయర్స్, బ్రూక్స్ తలా ఓ ఫోర్ బాది కాస్త టచ్‌లో కన్పించారు. అర్షదీప్ వేసిన రెండో ఓవర్లో మేయర్స్ (15పరుగులు 6బంతుల్లో) ఫోర్, సిక్స్ కొట్టి కాస్త ప్రమాదకరంగా కన్పించాడు. అయితే అర్షదీప్ తెలివిగా లెగ్ బ్రేక్ షార్ట్ బాల్ వేసి అతన్ని క్యాచ్ ఔట్ చేశాడు.

ఇక ఆ తర్వాత రెగ్యులర్‌గా ఆ జట్టు వికెట్లు కోల్పోతూనే ఉంది. వన్డౌన్లో దిగిన జాసన్ హోల్డర్ (0)ను జడేజా 3వ ఓవర్లో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత పూరన్ (18), హెట్మయర్ (14)ల అంతు అశ్విన్ చూడగా.. రోమాన్ పావెల్ (14), ఓడియన్ స్మిత్ (0)ను బిష్ణోయ్ బుట్టలో వేసుకున్నాడు. అకెల్ హోసెన్ (11)ను అర్షదీప్ ఔట్ చేశాడు. కీమో పాల్ (11నాటౌట్), అల్జారీ జోసెఫ్ (5నాటౌట్) క్రీజులో మిగిలిపోయారు. దీంతో 20ఓవర్లకు ఆ జట్టు కేవలం 122పరుగులు మాత్రమే చేయగలిగింది.

తుది జట్లు

తుది జట్లు

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షమర్ బ్రూక్స్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్ కం కెప్టెన్), కైల్ మేయర్స్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్, కీమో పాల్

భారత్ : 1.రోహిత్ శర్మ (కెప్టెన్), 2.రిషబ్ పంత్ (వికెట్ కీపర్), 3.శ్రేయాస్ అయ్యర్, 4.సూర్యకుమార్ యాదవ్, 5.హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), 6.దినేష్ కార్తీక్, 7.రవీంద్ర జడేజా, 8. రవి బిష్ణోయ్, 9.భువనేశ్వర్ కుమార్, 10.ఆర్ అశ్విన్, 11.అర్ష్‌దీప్ సింగ్

Story first published: Saturday, July 30, 2022, 7:30 [IST]
Other articles published on Jul 30, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+