India vs WestIndies : సిరాజ్ ‘హోప్’ ఇచ్చినా.. టార్గెట్ దిశగా వెస్టిండీస్.. 16ఓవర్లకు సీన్ ఇలా..!

శిఖర్ ధావన్ కెప్టెన్సీలో టీమిండియా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఆడుతుంది. టీమిండియా తొలుత బ్యాటింగ్లో 50ఓవర్లకు 7వికెట్లు కోల్పోయి 308పరుగులు చేసింది. తద్వారా విండీస్‌కు 309పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (64పరుగులు 53బంతుల్లో), శిఖర్ ధావన్ (97పరుగులు 99బంతుల్లో), నంబర్ 3 బ్యాటర్ శ్రేయస్ అయ్యార్ (54పరుగులు 57బంతుల్లో) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇకపోతే ఈ మ్యాచ్‌కు కుడి మోకాలి గాయం వల్ల వైస్ కెప్టెన్‌గా ఎంపికైన రవీంద్రా జడేజా దూరమయ్యాడు. అతను రెండో వన్డేకు కూడా అందుబాటులో ఉండడు. దీంతో వైస్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యార్ వ్యవహరిస్తున్నాడు. బ్యాటింగ్లో ఇండియా తొలి 35ఓవర్లకు 2వికెట్లు కోల్పోయి 225పరుగులు చేయగా.. చివరి 15ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి కేవలం 83పరుగులు మాత్రమే చేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్ (13), సంజూ శాంసన్ (12), దీపక్ హుడా (27), అక్షర్ పటేల్ (21) చివర్లో తడబడ్డారు. ఇక వెస్టిండీస్ జట్టు బౌలర్లలో జోసేఫ్, మోటీ 2 వికెట్లు తీయగా.. షెపర్డ్, హోసెన్ తలా ఓ వికెట్ తీశారు.
ఇక అనంతరం ఛేజింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు మహమ్మద్ సిరాజ్ ఆదిలోనే షాకిచ్చాడు. షాయ్ హోప్ (7)ను 5వ ఓవర్లో క్యాచ్ ఔట్ చేశాడు. అయితే హోప్ ఔటయినప్పటికీ.. ఆ జట్టు బ్యాటర్లు కైల్ మేయర్స్ (50పరుగులు 42బంతుల్లో 8ఫోర్లు నాటౌట్), షమ్రా బ్రూక్స్ (32పరుగులు 37బంతుల్లో 4ఫోర్లు నాటౌట్) నిలదొక్కుకుని ఆడుతున్నారు. దీంతో ఆ జట్టు 15ఓవర్లకు 94పరుగులు చేసింది. ఇంకా 34ఓవర్లలో ఆ జట్టు 215పరుగులు చేయాలి. ఇక మ్యాచ్ ముగిసేసరికి 3 దాటిపోతుంది. ఇకపోతే ఈ మ్యాచులో కొన్ని అరుదైన రికార్డులు కూడా వెలుగుచూశాయి. వాటిని ఓసారి పరిశీలిద్దాం.
వెస్టిండీస్లో వన్డే ఫార్మాట్లో హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన భారత ప్లేయర్
1. 22 ఏళ్ల 215 రోజులు - విరాట్ కోహ్లీ
2. 22 ఏళ్ల 317 రోజులు - శుభమాన్ గిల్ *
3. 24 ఏళ్ల 3రోజులు - సచిన్ టెండూల్కర్
నోట్ : వెస్టిండీస్లో అతి చిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన ఓపెనర్ శుభ్ మాన్ గిల్
వేగవంతంగా వన్డే ఫార్మాట్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఇండియన్ (ఇన్నింగ్స్ పరంగా)
24 - విరాట్ కోహ్లీ
24 - శిఖర్ ధావన్
25 - శ్రేయాస్ అయ్యర్ (10హాఫ్ సెంచరీలు, 1సెంచరీ) *
25 - నవజ్యోత్ సిద్ధూ
27 - కేఎల్ రాహుల్
వన్డేలలో స్కోరు 90లలో ఉన్నప్పుడు అత్యధిక సార్లు ఔటయిన ఇండియన్ ప్లేయర్లు
7 - సచిన్ టెండూల్కర్
6 - శిఖర్ ధావన్
6 - సౌరవ్ గంగూలీ
5 - విరాట్ కోహ్లీ
5 - వీరేంద్ర సెహ్వాగ్
వన్డేల్లో హాఫ్ సెంచరీ సాధించిన అతి ఎక్కువ వయసు ఉన్న భారత కెప్టెన్
36ఏళ్ల 229రోజులు - శిఖర్ ధావన్ *
36ఏళ్ల 120రోజులు - 1999లో మహ్మద్ అజారుద్దీన్
35ఏళ్ల 225రోజులు - 1985లో సునీల్ గవాస్కర్
35ఏళ్ల 108రోజులు - 2016లో ఎంఎస్ ధోనీ
35ఏళ్ల 73రోజులు - 2022లో రోహిత్ శర్మ
మొదటి 150 ODI ఇన్నింగ్స్‌లలో అత్యధిక బౌండరీలు బాదిన ప్లేయర్
875: శిఖర్ ధావన్*
771: హషీమ్ ఆమ్లా
766: క్రిస్ గేల్
737: మార్టిన్ గప్టిల్
మొదటి 150 ODI ఇన్నింగ్స్‌లలో అత్యధిక 50+ స్కోర్లు చేసిన ప్లేయర్
57: హషీమ్ ఆమ్లా
55: విరాట్ కోహ్లీ
55: వివియన్ రిచర్డ్స్
53: శిఖర్ ధావన్*
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications