India vs WestIndies : అదిరిన ఆరంభం, వెస్టిండీస్‌పై సెంచరీ చేయాలన్న కల మరోసారి మిస్ చేసుకున్న ధావన్..?

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : శిఖర్ ధావన్ కెప్టెన్సీలో యువ ప్లేయర్లు వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో కాలుదువ్వుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌కు ముందు టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, శిఖర్ ధావన్ బరిలోకి దిగి వెస్టిండీస్ బౌలర్లపై ప్రతాపం చూపించారు. తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టి గబ్బర్ హిట్టింగ్ మొదలెట్టారు.
2వ ఓవర్లో శుభ్ మన్ గిల్ కూడా ఎదుర్కొన్న తొలి బంతికే ఫోర్‌తో టచ్‌లోకి వచ్చాడు. అల్జారీ జోసేఫ్, సీల్స్, షెపర్డ్ బౌలింగ్‌ను వీరిద్దరూ ఉతికి ఆరేశారు. వీరిద్దరి ధాటికి 14ఓవర్లకే టీమిండియా స్కోరు వికెట్ నష్టపోకుండా వంద దాటింది.

సెంచరీ చేయాలన్న కల చేజారింది
ఈ క్రమంలో గిల్, ధావన్ హాఫ్ సెంచరీ చేసుకుని తమ దాడిని మరింత తీవ్రతరం చేశారు. అయితే నికోలస్ పూరన్ డైరెక్ట్ హిట్ ద్వారా శుభ్ మన్ గిల్ (64పరుగులు 54బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు)ను రనౌట్ చేయడంతో ఈ జోడీకి కళ్లెం పడింది. వీరిద్దరు 119పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ఇచ్చారు. ఆ తర్వాత గబ్బర్ తన మార్క్ షాట్లతో రెచ్చిపోయాడు.
ఈ క్రమంలో శ్రేయస్ అయ్యార్‌తో జత కలిసి బౌండరీలతో స్కోరుబోర్డును ఉరుకులెత్తించాడు. అయితే తొలుత నిదానంగా ఆడిన శ్రేయస్ కుదురుకున్న తర్వాత బౌలర్లపై పెత్తనం చెలాయించాడు. ధావన్‌ను (97పరుగులు 99బంతుల్లో 10ఫోర్లు, 3సిక్సర్లు) మోటీ ఊరించే బంతికి క్యాచ్ ఔట్ చేశాడు. జస్ట్ మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. తద్వారా వన్డేల్లో వెస్టిండీస్ మీద సెంచరీ కొట్టాలన్న ధావన్ మరోసారి ఫెయిలయ్యాడు.

శ్రేయాస్ అయ్యార్ హాఫ్ సెంచరీ
అయితే కెప్టెన్ సాబ్ మాత్రం తన జోరును ప్రదర్శించడం భారత అభిమానులను ఆకట్టుకుంది. తర్వాత శ్రేయాస్ అయ్యార్ (54పరుగులు 57బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) సైతం హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాక మోటీ బౌలింగ్లో ఔటయ్యాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ (13) సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. దీంతో స్కోరు 38.4ఓవర్లకు 4వికెట్లు కోల్పోయి 247పరుగులకు చేరుకుంది. క్రీజులో దీపక్ హుడా, సంజూ శాంసన్ ఉన్నారు.

తుది జట్లు :
భారత్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్ ( కెప్టెన్ ), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షాయ్ హోప్ ( వికెట్ కీపర్ ), బ్రాండన్ కింగ్, షమర్ బ్రూక్స్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, అకేల్ హోసేన్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications