ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మా అమ్మకు అంకితమిస్తున్నా.. అమ్మను తలుచుకుంటూ ఒబెడ్ మెక్కాయ్ భావోద్వేగం

సెయింట్ కిట్స్ : వార్నర్ పార్క్‌లో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ భారత జట్టుపై గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో ఒబెడ్ మెక్‌కాయ్ తన అద్భుతమైన బౌలింగ్‌తో భారత బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. ఇక ఈ మ్యాచులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా నిలిచాడు. అతను తొలి బంతికే రోహిత్ శర్మను క్యాచ్ ఔట్ చేసి వెస్టిండీస్‌కు బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఈ లెఫ్టార్మ్ సీమర్ మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. తన 4 ఓవర్లలో కేవలం 17పరుగులు మాత్రమే ఇచ్చాడు.
తద్వారా టీ20 ఇంటర్నేషనల్స్‌లో వెస్టిండీస్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. టీ20 స్పెషలిస్ట్ బౌలర్‌గా గుర్తింపు పొందిన మెక్‌కాయ్ 2019లో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడాడు. 15.48సగటుతో 29వికెట్లు తీశాడు. 25 ఏళ్ల మెక్కాయ్ వెస్టిండీస్ జట్టు డెత్ బౌలర్‌గా కూడా పేరొందాడు. నాణ్యమైన భారత బ్యాటింగ్ లైనప్‌ను తన బౌలింగ్లో చిత్తు చేయడం అతని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇకపోతే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్న తర్వాత మెక్‌కాయ్ భావోద్వేగంగా మాట్లాడాడు.
మా అమ్మే నన్ను ప్రోత్సహించింది
మ్యాచ్ ప్రెజెంటేషన్ సందర్భంగా మెక్‌కాయ్ మాట్లాడుతూ... అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని గుర్తుచేసుకున్నాడు. ఈ స్పెషల్ ప్రదర్శన తన తల్లికి అంకితం చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అమ్మ ఎప్పుడూ మెరుగైన ఆటగాడిగా తాను మారేందుకు ప్రేరేపించేదని పేర్కొన్నాడు. 'ఈ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ మా అమ్మ కోసం. ఆమె అనారోగ్యంతో ఉంది. ఆమె నన్ను మెరుగైన ఆటగాడిగా రూపొందేలా సదా ప్రోత్సహించేది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి బంతికే వికెట్ తీయడం బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తెచ్చిందనుకుంటున్నా. నేను పవర్‌ప్లేలో ఎప్పుడూ వికెట్ల కోసం ఆరాటపడతాను. ఆటను స్వచ్ఛంగా ఆస్వాదించాను. మునుపటి ఆటలో నేను కొంచెం ఎక్కువగా ఆలోచించాను. ఈ మ్యాచ్‌ను ఓ సవాల్‌గా తీసుకున్నా.' అని మ్యాచ్ అనంతర సమావేశంలో మెక్‌కాయ్ చెప్పాడు. నేడు సెయింట్ కిట్స్‌లోని వార్నర్ పార్క్‌లో మూడో టీ20 జరగుతుంది. మెక్కాయ్ సాధించిన కొన్ని రికార్డులు, గణాంకాలు
టీ20Iలలో వెస్టిండీస్ తరఫు అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు సాధించిన వారు
6/17 - ఒబెడ్ మెక్‌కాయ్, 2022 *
5/15 - కీమో పాల్, 2018
5/26 - డారెన్ సామీ, 2010
5/27 - జాసన్ హోల్డర్, 2022
5/28 - ఒషానే థామస్, 2020
టీ20ల్లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసినవారు
6/17 - ఒబెడ్ మెక్‌కాయ్, 2022 *
4/9 - వనిందు హసరంగా, 2021
4/11 - మిచెల్ సాంట్నర్, 2016
4/16 - డారెన్ సామీ, 2011

టీ20Iలలో సిక్స్-ఫర్‌లు సాధించినవారు
6/7- దీపక్ చాహర్ బంగ్లాదేశ్‌పై 2019లో
6/8 - అజంతా మెండిస్ జింబాబ్వేపై 2012లో
6/16 - అజంతా మెండిస్ ఆస్ట్రేలియాపై 2011లో
6/17 - ఒబెడ్ మెక్‌కాయ్ ఇండియాపై 2022లో
6/25 - యుజ్వేంద్ర చాహల్ ఇంగ్లాండ్‌పై 2017లో
6/30 - అష్టన్ అగర్ న్యూజిలాండ్‌పై 2021లో
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications