Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Westindies T20 Series: అతని వల్లే గెలిచామన్న నికోలస్ పూరన్.. వచ్చీ రాగానే విన్నింగ్ నాక్ ఆడాడు

India vs Westindies : Nicholas Pooran says Obed Mccoy Is at Best For Ourside For Win

సెయింట్ కిట్స్: వెస్టిండీస్ గడ్డపై టీమిండియా జోరుకు కరేబియన్ సేన్ బ్రేకులేసింది. వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి టీ20సిరీస్‌లో తొలి టీ20 మ్యాచ్ కూడా గెలిచి ఊపులో ఉన్న ఇండియాకు వెస్టిండీస్ ఝలక్ ఇచ్చింది. నిన్న జరిగిన రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్ 5వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. దాంతో ఐదు టీ20ల సిరీస్‌ 1-1తో సమమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 19.4 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. ఛేదనలో విండీస్ చివరి ఓవర్లో లక్ష్యాన్ని ఛేదిందింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్ ఒబెడ్ మెక్‌కాయ్ (6/17) ప్రదర్శనతో భారత్ పతనాన్ని శాసించాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్‌ ధాటికి భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.

ఇప్పుడు ఊపిరి తీసుకోగలుగుతున్నాను

ఇప్పుడు ఊపిరి తీసుకోగలుగుతున్నాను

మ్యాచ్ అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ మాట్లాడుతూ.. 'ఎట్టకేలకు నేను ఇప్పుడు ఊపిరి తీసుకోగలుగుతున్నాను. ఇది నిజంగా మాకు చాలా కఠినమైన సమ్మర్. మేము కొన్ని మ్యాచ్‌లను చాలా తక్కువ మార్జీన్ తేడాతో ఓడిపోయాం. దాని గురించి చాలా అలజడికి గురయ్యాం. ఏదేమైనా ఈ మ్యాచ్ గెలవడం మాలో మరిన్ని ఆశలు రేకెత్తించింది. బౌలింగ్లో ఒబెడ్ మెక్కాయ్ అద్భుతమైన పని చేశాడు. అతని వల్లే గెలిచాం. మా ప్లేయర్లందరూ పిచ్ మరియు పరిస్థితులను బాగా ఉపయోగించుకున్నారు. ఏదేమైనా గెలుపంటే గెలుపే.'

నేను, హెట్మయర్ బాధ్యత తీసుకోవాలి

నేను, హెట్మయర్ బాధ్యత తీసుకోవాలి

'ఇకపోతే బ్యాటింగ్లో మా టాపార్డర్ బ్యాట్స్‌మెన్ ఎక్కువసేపు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. నేను, హెట్మెయర్ మరింత బాధ్యత తీసుకోవాలి. బ్రాండన్ కింగ్ మ్యాచ్ విన్నింగ్ గేమ్ ఆడగలడని మాకు తెలుసు. ఈ మ్యాచ్‌లో అదే చేశాడు. ఈ మ్యాచ్ నుంచి అతను విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడడాన్ని నేర్చుకున్నట్టేనని అనుకుంటున్నా. థామస్ గాయం తర్వాత జట్టులోకి తిరిగి రావడం.. వచ్చీ రాగానే విన్నింగ్ నాక్ ఆడడం సంతోషకరం. ఇక ఒబెడ్ రెగ్యులర్ ఇంటర్వెల్లలో జట్టు కోసం వికెట్లు తీస్తూనే ఉన్నాడు. అతను దినేష్ కార్తీక్‌కు స్టంప్స్‌పై ఫుల్ మరియు స్ట్రేయిట్ బంతి విసురుతానన్నాడు. అది పనిచేసింది. అతను జట్టులో ఉండటం మాకు చాలా ఉపయుక్తంగా ఉంది.

బ్రాండన్ కింగ్, డేవన్ థామస్ విన్నింగ్ నాక్స్

బ్రాండన్ కింగ్, డేవన్ థామస్ విన్నింగ్ నాక్స్

ఇకపోతే ఈ మ్యాచ్‌లో లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్ (52 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68)హాఫ్ సెంచరీతో రాణించగా.. డేవన్ థామస్ (19 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 31 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. కైల్ మేయర్స్(8), నికోలస్ పూరన్(14), షిమ్రాన్ హెట్‌మైర్(6), రోవ్‌మన్ పొవెల్(5) విఫలమయ్యారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, జడేజా, అశ్విన్, హార్దిక్ పాండ్యా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు. చివరి ఓవర్లో భువనేశ్వర్‌కు బదులు అవేశ్ ఖాన్ చేత రోహిత్ బౌలింగ్ చేయించి మూల్యం చెల్లించుకున్నాడు.

Story first published: Tuesday, August 2, 2022, 9:50 [IST]
Other articles published on Aug 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+