
ఒకట్రెండు వికెట్లు త్వరగా పడగొట్టాల్సింది
'బౌలింగ్లో మేము ఆదిలోనే ఒకట్రెండు వికెట్లు పడగొట్టాల్సింది. కానీ అది జరగలేదు. అలా జరిగి ఉంటే కాస్త మ్యాచ్ టఫ్ అయ్యేది. భారత జట్టు బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. ఈ పిచ్ వికెట్ చాలా స్లోగా ఉంది. ఈ పిచ్‌పై స్కోరింగ్ చేయడం చాలా కష్టమే. ఇకపోతే మేం బ్యాటింగ్లో మిడిల్ ఓవర్లలో క్రమంగా వికెట్లు కోల్పోయాం. మేము ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ.. అన్నింటా సరైన విధంగానే ప్రదర్శన చేశామనుకుంటున్నాం. బ్యాటింగ్లో మేము 10-15పరుగులు ఎక్కువ చేయాల్సింది. బౌలింగ్లో తొలుత ఒకట్రెండు వికెట్లు తీయాల్సింది. అదే జరిగి ఉంటే మ్యాచ్ వేరేలా ఉండేది. అందువల్లే మ్యాచ్ కోల్పోయాం.' అని పూరన్ చెప్పాడు.

తేలిపోయిన బౌలర్లు
మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ బ్యాటర్లలో ఓపెనర్ కైల్ మేయర్స్ (50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు 73) చెలరేగి ఆడాడు. బ్రాండన్ కింగ్ (20 బంతుల్లో 20)తో కలిసి 57పరుగులు ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించాడు. కెప్టెన్ పూరన్ (23 బంతుల్లో 22), రోవ్‌మన్ పావెల్ (14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ 23), హెట్‌మైర్ (12 బంతుల్లో 2సిక్సర్లతో 20) పర్వాలేదనిపించేలా ఆడారు. తద్వారా విండీస్ 4వికెట్లు కోల్పోయి 164పరుగులు చేయగలిగింది. 165పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో విండీస్ బౌలర్లు తేలిపోయారు. ఫీల్డర్లు సైతం ఒకట్రెండు క్యాచ్ అవకాశాలను మిస్ చేసుకోవడం ఆ జట్టు కొంపముంచింది. డొమినేక్ డ్రేక్స్ 1, జాసన్ హోల్డర్ 1, అకెల్ హోసెన్ 1 వికెట్ తీశారు.

తుది జట్లు
వెస్టిండీస్ : బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ (c), షిమ్రాన్ హెట్మెయర్, డెవాన్ థామస్ (WK), రోవ్‌మాన్ పావెల్, డొమినిక్ డ్రేక్స్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్
ఇండియా : రోహిత్ శర్మ (c), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (WK), హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్


Click it and Unblock the Notifications












