శిఖర్ ధావన్ ఓ పిరికిపంద.. మూడో వన్డే జట్టు పట్ల నెటిజన్ల ఫైర్.. ఇంత కక్కుర్తి పనికిరాదంటూ ట్వీట్లు..!

వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం జరుగుతున్న చివరి వన్డేలో భారత తుది జట్టులో కొత్తవాళ్లకు అవకాశాలుంటాయని భావించిన సగటు భారత అభిమానికి నిరాశే ఎదురైంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0తేడాతో ఇప్పటికే ఇండియా సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా యువ జట్టులో కాసిన్ని మార్పులు తథ్యంగా ఉంటాయని అంతా భావించారు.
ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో అర్షదీప్ లాంటి యంగ్ ట్యాలెంటెడ్ ప్లేయర్ వన్డేల్లో అరంగేట్రం చేయబోతాడని దాదాపు అందరూ ఎక్స్ పెక్ట్ చేశారు. అలాగే బ్యాటింగ్ విభాగంలోనూ ఇషాన్ కిషన్‌కు, రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం దక్కుతుందనిపించింది. కానీ పెద్దగా మార్పులు చేయకుండానే శిఖర్ ధావన్ టీంను బరిలోకి దింపాడు.
అర్షదీప్ అంటే ఎందుకంత చులకన
ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్లో అర్షదీప్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు రోహిత్ శర్మ సిరీస్ గెలిచినందున అర్షదీప్‌ను అరంగేట్రం చేయించాడు. ఈసారి కూడా ధావన్ సైతం అదే పని చేస్తాడనుకున్నారు. అయితే సిరీస్ గెలిచినా.. అతను అర్షదీప్ లాంటి ట్యాలెంటెడ్ ప్లేయర్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడంతో అంతా అవాక్కయ్యారు.
ఎప్పటిలాగే శార్దూల్ ఠాకూర్, సిరాజ్, ప్రసీద్ క్రిష్ణకు అవకాశమిచ్చాడు. పోనీ రెండో వన్డేలో అరంగేట్రం చేసిన అవేశ్ ఖాన్‌ను అయినా కొనసాగించాడా అంటే అది లేదు.. ఒక్క మ్యాచ్‌కే అవేశ్ ఖాన్‌ను పక్కన పెట్టేసి.. మళ్లీ ప్రసీద్ క్రిష్ణకు అందలం వేశాడు. దీంతో నెటిజన్లు తీవ్రంగా సీరియస్ అవుతున్నారు.
ధావన్ ఓ పిరికిపంద అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వివక్షపూరితమైన సెలెక్షన్ ఇది అంటూ మరో నెటిజన్ మండిపడ్డాడు. ప్రతిసారి అర్షదీప్ సింగ్‌ను ఎందుకు ఆడిపోసుకుంటున్నారు అంటూ ఇంకో నెటిజన్ సీరియస్ అయ్యాడు. ధావన్‌కు ఇంత కక్కుర్తి పనికిరాదంటూ ఇంకొకరు కామెంట్ చేశారు.
ఆ ఇద్దరినీ ఆడిస్తే పోయేదేముంది
అలాగే జట్టులో బెంచ్ ప్లేయర్ల సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి వచ్చిన అవకాశాన్ని ధావన్, ద్రావిడ్ ఎందుకు ఉపయోగించుకోవడం లేదో అర్థం కావడం లేదు. రుతురాజ్ గైక్వాడ్ లాంటి ఫర్ ఫెక్ట్ వన్డే ప్లేయర్‌ను ఒక్క మ్యాచ్ ఆడిస్తే ఏం పోయేది. రెండు మ్యాచ్‌లలో ఆడినవాళ్లలో ఒకరిద్దరిని పక్కనపెట్టి రుతురాజ్, ఇషాన్ కిషన్‌ను బరిలోకి దింపితే.. వాళ్ల సత్తా ఏంటో కూడా తెలిసేది కదా..! పక్కన పెట్టడం తప్పు పదమనిపిస్తే విశ్రాంతినిస్తున్నట్లు ప్రకటించి.. జట్టులోని టాపార్డర్లో గిల్, శ్రేయస్, సూర్యకుమార్ యాదవ్‌లలో ఒకరిని ఒక్క మ్యాచ్ తప్పిస్తే ఏమవుతుండే.. టాపార్డర్లో బెంచ్ ప్లేయర్లు కూడా బానే ఉన్నారనే భరోసా అయినా దక్కేది కదా అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఇక చివరి వన్డేకు ఎంపికయిన తుది జట్టు ఇదే
టాపార్డర్ - కెప్టెన్ శిఖర్ ధావన్, శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యార్
మిడిలార్డర్ - సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, దీపక్ హుడా
ఆల్రౌండర్లు (లోయర్ ఆర్డర్) - అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్
బౌలర్లు (టెయిలెండర్లు) - మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసీద్ క్రిష్ణ
ఇక బెంచ్ మీద కూర్చున్న ప్లేయర్లు వీరే
ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, రవీంద్రా జడేజా (ఇంజూరీ వల్ల తప్పుకున్నాడు)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications