India vs WestIndies : సంజూ శాంసన్‌కు దక్కిన అదృష్టం.. అనూహ్యంగా టీ20 జట్టులో చోటు.. ఎందుకంటే?

వెస్టిండీస్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు సంజూ శాంసన్‌ను టీమిండియా టీ20 జట్టులో చేరాడు. నేడు ట్రినిడాడ్‌లో సిరీస్ తొలి మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు ఎంపికైన కేఎల్ రాహుల్ స్థానంలో సంజూ శాంసన్‌ని బ్యాటింగ్ లైనప్‌లోకి సెలెక్టర్లు తీసుకున్నారు. కేరళకు చెందిన ఈ స్టార్.. వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్ జట్టులో వికెట్ కీపర్ కం బ్యాటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. తొలుత సంజూ శాంసన్ టీ20 జట్టుకు ఎంపిక కాలేదు. అనూహ్యంగా కేఎల్ రాహుల్ స్థానంలో అతనికి అవకాశమొచ్చింది.

కేఎల్ రాహుల్ స్థానంలో అందుకే సంజూ శాంసన్
కేఎల్ రాహుల్‌ని వెస్టిండీస్‌తో T20 సిరీస్ కోసం సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే ఓ కండీషన్ కూడా పెట్టారు. జట్టులోకి రావాలంటే అతను తన గాయం నుంచి కోలుకుని పూర్తిగా ఫిట్‌నెస్ సాధించాలి. ఐపీఎల్ ముగిసినప్పటి నుంచి కేఎల్ రాహుల్ టీమిండియాకు దూరమయ్యాడు. గజ్జలో గాయం కారణంగా శస్త్రచికిత్స కోసం జర్మనీకి వెళ్లాడు. శస్త్రచికిత్స తర్వాత అతను కోలుకుని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి తిరిగి వచ్చి అక్కడ తన ప్రాక్టీస్, ఫిట్ నెస్ మెరుగుపర్చుకున్నాడు. పూర్తి ఫిట్ నెస్ సాధించిన తరుణంలో కోవిడ్ -19 అతన్ని మళ్లీ దెబ్బతీసింది. అతను ఎన్సీఏలో కరోనా బారిన పడడంతో కరేబియన్ టూర్‌కు వెళ్లలేకపోయాడు. బీసీసీఐ వైద్య సిబ్బంది ప్రకారం రాహుల్ విశ్రాంతి తీసుకోవడానికి, కోలుకోవడానికి మరో వారం పడతుంది. అందుకే అతని స్థానంలో సంజూను టీ20 జట్టుకు సెలెక్టర్లు ఎంపిక చేశారు.

సంజూకు ఏకైక అవకాశమిదే
సంజూ శాంసన్‌ను టీ20 సిరీస్ కోసం బీసీసీఐ శుక్రవారం జట్టులోకి చేర్చింది. అయితే ఈ విషయమై బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండానే తొలి టీ20కి జట్టు స్క్వాడ్‌లో అతని పేరును చేర్చింది. ఈ సిరీస్లో శాంసన్‌కు తుది జట్టులో అవకాశాలొస్తే.. తనను తాను నిరూపించుకోవాలని చూస్తున్నాడు. అతను టీ20ప్రపంచకప్ కోసం భారత జట్టులో చోటు సంపాదించడం దాదాపు కష్టమే. ఎందుకంటే జట్టులో ప్లేయర్ల మధ్య అత్యంత పోటీ నెలకొంది. కానీ ఒకవేళ ఈ సిరీస్లో అతనికి అవకాశాలొచ్చి అనూహ్యంగా చెలరేగితే గనుక ఏమైనా చాన్స్ ఉండొచ్చు. ఇటీవల వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో కీలక టైంలో హాఫ్ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే.

భారత T20I జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్*, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications