India vs WestIndies : అందుకే బ్యాటింగ్ : ధావన్.. అర్షదీప్‌కు మళ్లీ నిరాశే, ప్రసీద్‌కే ప్రసాదం..!

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : వెస్టిండీస్ గడ్డపై మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ నగరం క్వీన్ పార్క్ ఓవల్‌లో జరగనున్న చివరి వన్డేలోనూ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భారత్ చూస్తుంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0తేడాతో ఇప్పటికే ఇండియా సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా యువ జట్టు అన్ని విభాగాల్లో సత్తా చాటుతుంది. ఇకపోతే జరిగిన రెండు మ్యాచ్‌ల్లో విజయం కోసం ఆఖరి వరకు పోరాడి గెలుపు ముంగిట బోర్లాపడిన విండీస్.. చివరి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని భావిస్తోంది.
అందుకు టీం పటిష్ఠ ప్రణాళికతో బరిలోకి దిగనుంది. మూడో వన్డేకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రస్తుతమైతే మ్యాచ్ జరగడానికే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా ఎంపికైన ప్యాడీ అప్టన్ జట్టుతో పాటు చేరాడు. ఈ మేరకు బీసీసీఐ సైతం అతని గురించి ఓ వీడియోను పోస్ట్ చేసింది.

రవీంద్రా జడేజాకు బదులు గత మ్యాచ్ విన్నరే బరిలోకి
ఈ మ్యాచ్ టాస్ కోసం ఇరువురు జట్ల కెప్టెన్లు గ్రౌండ్లోకి వచ్చారు. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ శిఖర్ ధావన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక టాస్ అనంతరం ధావన్ మాట్లాడుతూ.. 'మేము మొదట బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. మేము ముందుగా మంచి స్కోర్‌ను స్కోరుబోర్డు మీద పోస్ట్ చేయాలనుకుంటున్నాం. ఇక మా జట్టు పరంగా గొప్ప విషయమేంటంటే.. మేం అన్ని విభాగాల్లో రాణిస్తున్నాం. చూడటానికి బాగుంది. అది మాకు పెద్ద సానుకూలాంశం. ఏదేమైనా చివరి మ్యాచ్‌లోనూ మా ఇంటెంట్ కనబర్చాలి.
అదే సమయంలో చాలా తెలివిగా కూడా ఆడాలి. కోచ్ ద్రావిడ్ మాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. ఆటగాళ్లు ఎంత ఎక్కువగా ఆడితే అంత మెరుగవుతారు. మా జట్టు తరఫున ఒక మార్పు చోటుచేసుకుంది. అవేష్ ఖాన్ స్థానంలో ప్రసీద్ క్రిష్ణ తిరిగి జట్టులోకి వచ్చాడు.' అని ధావన్ తెలిపాడు. అర్షదీప్ తుది జట్టులోకి వస్తాడని ఆశిస్తే నిరాశే ఎదురైంది. అలాగే రవీంద్రా జడేజాకు బదులు గత మ్యాచ్ విన్నర్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్‌లోనూ కొనసాగుతున్నాడు.

రెండు మ్యాచ్‌లలో ఓడిపోవడంతో హార్ట్ బ్రేక్
టాస్ ఓడిన అనంతరం నికోలస్ పూరన్ మాట్లాడుతూ.. మొదటి రెండు గేమ్‌లలో చివరి వరకు వచ్చి ఓడిపోవడం వల్ల కాస్త హార్ట్ బ్రేక్ అయింది. ఈ రోజు మేం ప్రేరణ పొందాం. మేం ఆ విజయ గీతను అధిగమించాలి. మేము 50 ఓవర్ల బ్యాటింగ్ గురించి మాత్రమే ఆలోచించాం కానీ మేము పరిస్థితులను కూడా కాస్త అన్వయించుకుంటూ ఆడాల్సిన అవసరముంది. మేము చివరి మ్యాచ్‌లో పాజిటివ్ ఫలితాన్ని చూస్తామనుకుంటున్నాం. మా జట్టులోకి హోల్డర్, కీమో, కార్తీ వచ్చారు. అని పూరన్ తెలిపాడు.

తుది జట్లు
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షాయ్ హోప్ (కెప్టెన్), బ్రాండన్ కింగ్, కీసీ కార్తీ, షమర్ బ్రూక్స్, నికోలస్ పూరన్ (కెప్టెన్), కైల్ మేయర్స్, జాసన్ హోల్డర్, కీమో పాల్, అకేల్ హోసేన్, హేడెన్ వాల్ష్, జేడెన్ సీల్స్
భారత్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications