పూరన్ స్టన్నింగ్ డైరెక్ట్ హిట్, బ్రూక్స్ కిరాక్ క్యాచ్
ఈ క్రమంలో హాఫ్ సెంచరీలు చేసుకుని గిల్, ధావన్‌లు తమ దాడిని తీవ్రతరం చేస్తున్న టైంలో వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ ఆ జట్టుకు కిరాక్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. డైరెక్ట్ హిట్ ద్వారా శుభ్ మన్ గిల్‌ను రనౌట్ చేశాడు. దీంతో 119పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. శుభ్ మన్ గిల్ డైవ్ చేస్తే రనౌట్ కాకపోయేవాడు. కానీ కాస్త లేజీగా వ్యవహరించాడు. ఇక గబ్బర్ మాత్రం తనదైన షాట్లతో భీకరంగా రెచ్చిపోతూ.. మరో ఎండ్‌లో శ్రేయస్ అయ్యార్‌తో కలిసి స్కోరుబోర్డును పరుగులెట్టించాడు. ఈ క్రమంలో మళ్లీ వెస్టిండీస్ ఫీల్డింగ్‌ను మెచ్చుకోకుండా ఉండలేము. సెంచరీకి మూడు పరుగుల దూరం ధావన్ బ్యాక్ పాయింట్ షాట్ అడగా.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న షమ్రా బ్రూక్స్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. లెఫ్ట్ సైడ్ డైవ్ చేస్తూ గాల్లోనే ఒంటి చేత్తో క్యాచ్ అందుకు వాహ్వా అనిపించాడు. దీంతో వన్డేల్లో వెస్టిండీస్ మీద సెంచరీ కొట్టాలన్న ధావన్ కల చేజారింది.
మళ్లీ శ్రేయాస్ అయ్యర్ సైతం..
ఇక ధావన్‌తో కలిసి 94పరుగుల విలువైన భాగస్వామ్యం అందించిన శ్రేయాస్ అయ్యార్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతను (54పరుగులు 57బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాక మోటీ బౌలింగ్లో ఔటయ్యాడు. అతను కొట్టిన సొగసైన షాట్‌ను కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న పూరన్ అత్యద్భుతంగా అందుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ (13), సంజూ శాంసన్ (12)ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. 39ఓవర్లకు స్కోరు 4వికెట్లు పడిపోయి 248ఉండగా.. ఆ తర్వాత పెద్దగా కదల్లేదు. సంజూ శాంసన్ (12) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగగా, క్రీజులో దీపక్ హుడా (27పరుగులు 32బంతుల్లో 1ఫోర్లు, 1సిక్సర్లు) కాస్త తడబడ్డాడు. అక్షర్ పటేల్ (21పరుగులు 21బంతుల్లో 1ఫోర్, 1సిక్సర్) పర్వాలేదనిపించాడు. దీంతో స్కోరుబోర్డు 308పరుగులకు చేరుకుంది. చివరి 11ఓవర్లలో ఇండియా కేవలం 60 పరుగులు మాత్రమే చేసింది. డెత్ ఓవర్లలో విండీస్ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో జోసేఫ్, మోటీ 2 వికెట్లు తీయగా.. షెపర్డ్, హోసెన్ తలా ఓ వికెట్ తీశారు.
తుది జట్లు :
భారత్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్ ( కెప్టెన్ ), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షాయ్ హోప్ ( వికెట్ కీపర్ ), బ్రాండన్ కింగ్, షమర్ బ్రూక్స్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, అకేల్ హోసేన్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్


Click it and Unblock the Notifications
