Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నీకు బుద్ధుంటే ముందే ఆ పని చేయాల్సింది.. ప్రయోగాల పేరిట ఓడిపోవడం సరికాదంటూ రోహిత్‌‌పై నెటిజన్ల ఫైర్

India vs Westindies : If You Want Test Avesh Khan You May Give Rest To Bhuvi, Netizens Fire on Rohit

సెయింట్ కిట్స్: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ పరాజయం పాలయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 5వికెట్ల తేడాతో గెలిచి ఐదు టీ20ల సిరీస్‌లో 1-1తో సమం చేసి రేసులోకి వచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత ఓటమికి బ్యాటింగ్ వైఫల్యం ప్రధాన కారణమని అర్థమవుతుండగా.. మరో కారణం కూడా హైలెట్ అవుతుంది. అదేంటంటే చివరి ఓవర్లో అవేశ్ ఖాన్‌తో రోహిత్ శర్మ బౌలింగ్ వేయించడం. చివరి ఓవర్లో 10పరుగులు కావాల్సిన తరుణంలో డెత్ స్పెషలిస్టు భువనేశ్వర్‌ను కాదని అవేశ్ ఖాన్‌కు బౌలింగ్ ఇవ్వడం భారత్ కొంపముంచింది.

అంతకుముందు భువీ 2ఓవర్లలో కేవలం 12పరుగులు మాత్రమే ఇచ్చి మంచి స్వింగ్ మీదున్నాడు. ఒకవేళ భువీకి బౌలింగ్ ఇచ్చి ఉంటే మ్యాచ్ రిజల్ట్ వేరేలా ఉండేదేమో. ఇక రోహిత్ శర్మ భువీని కాదని అవేష్ చేత బౌలింగ్ వేయించడాన్ని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ట్వీట్లు, పోస్టులతో విరుచుకుపడుతున్నారు.

రోహిత్ శర్మ ఏమన్నాడంటే..

మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ ఈ విషయమై మాట్లాడుతూ.. కొత్త కుర్రాళ్లకు అవకాశాలు కల్పించాలనేది నా ఉద్దేశం. చివరి ఓవర్లో భువీ వేస్తే అతను టీం కోసం ఏమి చేసేవాడో మనకు తెలిసిందే. అతను సంవత్సరాలుగా డెత్ ఓవర్లలో ఎంతో గొప్ప బౌలింగ్ వేస్తున్నాడు. నా ప్రకారం.. అవేష్, అర్ష్‌దీప్ లాంటి వాళ్లకు కూడా చివరి ఓవర్ అవకాశాలు ఇస్తే తప్ప మీకు వాళ్ల సత్తా ఏంటో ఎప్పటికీ తెలియదు. అందువల్లే అవేష్ ఖాన్‌ను ప్రయోగించా. మేం ఓడిపోవచ్చు. కేవలం ఒక గేమ్ మాత్రమే. అవేశ్ ఖాన్ విఫలమైనంత మాత్రాన అతన్ని తక్కువ అంచనా వేయలేం. అతనిలో నైపుణ్యం, ప్రతిభ దాగి ఉంది. అతనికి మద్దతుగా నిలుస్తూనే ఉంటాం.‌' అని రోహిత్ అన్నాడు.

కొత్త వాళ్ల కోసం మ్యాచ్‌లు ఓడిపోవాలా?

ఇక రోహిత్ నిర్ణయం పట్ల నెటిజన్లు చాలా హర్ష్‌గా ట్వీట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ ఓ పోస్టులో.. నీకు అంతగా అవేశ్ ఖాన్‌ను టెస్ట్ చేయాలనిపిస్తే.. భువీకి రెస్ట్ ఇవ్వాల్సింది అంటూ ట్వీట్ చేశాడు. బుద్ధుంటే ముందే భువీని తప్పించి అవేశ్ ఖాన్‌ను, ఇంకా జూనియర్ పేసర్లను ఆడించాలని రోహిత్‌కు సదరు నెటిజన్ హితవు పలికినట్లుంది. రోహిత్ నువ్వు చేసింది తప్పనట్లేదు కానీ.. కొత్తవాళ్లను ప్రయోగించాలని చూసి మ్యాచ్ ఓడిపోయేలా చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మరో నెటిజన్ దెప్పిపొడిచాడు.

వాళ్లెందుకు ఆడుతున్నారో అర్థం కావట్లేదు

మరో నెటిజన్ స్పందిస్తూ.. అసలు టీంలో అవేశ్ ఖాన్, అశ్విన్ ఎందుకు ఆడుతున్నారో అర్థం కావట్లేదు. వాళ్లిద్దరూ బౌలింగ్లో ధారాళంగా పరుగులిచ్చేస్తున్నారు. అయినా కానీ వాళ్లను పట్టుకుని వేలాడుతున్నారు. రోహిత్ గొప్ప కెప్టెన్ అంటుంటారు.. లాస్ట్ ఓవర్లో అతని మైండ్ ఎలా పనిచేసిందో మరీ అంటూ తన అక్కసు వెళ్లగక్కాడు.

ఇక ప్రముఖ క్రికెటర్ వసీం జాఫర్ సైతం.. రాత్రిళ్లు 2.30వరకు మ్యాచ్ చూసిన భారత అభిమానుల ఫ్రస్టేషన్ ఏ రేంజులో ఉందో చెప్పడానికి మిస్టర్ బీన్ వీడియోను పోస్ట్ చేశాడు. ఇకపోతే కొందరు నెటిజన్లు రోహిత్ ప్రయోగాన్ని మెచ్చుకున్నారు. కొత్త వాళ్లతో చివరి ఓవర్లో వేయిస్తేనే కదా వాళ్లకు కూడా అనుభవమొచ్చేది అంటూ రోహిత్‌కు వత్తాసు పలికారు.

Story first published: Tuesday, August 2, 2022, 10:41 [IST]
Other articles published on Aug 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+