Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రమాదకర జోడికి బ్రేకులేసిన దీపక్ హుడా.. బ్యాటర్లను బురిడీ కొట్టిస్తున్న స్పిన్నర్లు, అయినా విండీస్‌కు ‘హోప్’

pooran

ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌కు ఓపెనర్లు కైల్ మేయర్స్, షాయ్ హోప్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ పవర్ ప్లేలో బౌండరీల వరద పారించారు. 9ఓవర్లు పూర్తయ్యేసరికి స్కోరు 65పరుగులకు చేరుకుంది. పేసర్ల బౌలింగ్‌ను ఈజీగా ఎదుర్కొన్న వీరిద్దరూ స్టేడియం నలువైపులా ఫోర్లు, సిక్సులు బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ఇక షాయ్ హోప్ కాస్త ఆచితూచి ఆడినప్పటికీ.. కైల్ మేయర్స్ మాత్రం దూకుడుగా ఆడాడు.


తొలి బంతికే మేయర్స్ క్యాచ్ ఔట్
ఇక వీరిద్దరి జోడీ ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో 10వ ఓవర్ బౌలింగ్ అందుకున్న దీపక్ హుడా.. వీరిద్దరి భాగస్వామ్యానికి బ్రేకులేశాడు. తొలి బంతికే మేయర్స్‌ను కాట్ అండ్ బౌల్డ్‌గా అవుట్ చేశాడు. కైల్ మేయర్స్ (39పరుగులు 23బంతుల్లో 6ఫోర్లు, 1సిక్సర్) మంచి టచ్‌లోకి వచ్చేశాడు. అతన్ని ఔట్ చేయడంతో స్కోరు కాస్త అదుపులోకి వచ్చింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షమరా బ్రూక్స్ సైతం కాస్త ధాటిగానే ఆడాడు. షాయ్ హోప్‌తో కలిసి రెండో వికెట్‌కు 62పరుగులు జోడించాడు. ఇక అక్షర్ పటేల్ బౌలింగ్లో బ్రూక్స్ (35పరుగులు 36బంతుల్లో 5ఫోర్లు) స్లిప్‌లో ధావన్‌కు దొరికిపోయాడు.

కుదురుకున్న షాయ్ హోప్
క్రీజులోకి దిగిన బ్రాండన్ కింగ్‌ను చాహల్ తెలివైన బంతితో బురిడీ కొట్టించాడు. స్వీప్ షాట్ ఆడాలని చూడగా బంతి ఎడ్జ్ అయి గాల్లోకి లేచింది. స్లిప్‌లో ఉన్న ధావన్ సులువుగా క్యాచ్ అందుకోవడంతో అతను డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న షాయ్ హోప్ ( 77పరుగులు 94బంతుల్లో 8ఫోర్లు, 1సిక్సర్ ) మొండిగా క్రీజులో నిలబడి పోరాడుతున్నాడు. ఇక అతనికి తోడు కెప్టెన్ నికోలస్ పూరన్ (12పరుగులు 21బంతుల్లో ) నిదానంగా ఆడుతున్నాడు. ఇక 30వ ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ 3వికెట్లు కోల్పోయి 165పరుగుల స్కోరుకు చేరుకుంది.

తుది జట్లు :
భారత ప్లేయింగ్ XI: 1.శిఖర్ ధావన్ (కెప్టెన్), 2.శుభ్‌మన్ గిల్, 3 శ్రేయాస్ అయ్యర్, 4.సూర్యకుమార్ యాదవ్, 5.సంజు శాంసన్ (వికెట్ కీపర్), 6.దీపక్ హుడా, 7.అక్షర్ పటేల్, 8.శార్దూల్ ఠాకూర్, 9.మహ్మద్ సిరాజ్, 10.చాహల్, 11.అవేష్ ఖాన్.
వెస్టిండీస్ ప్లేయింగ్ XI: 1.షాయ్ హోప్ (వికెట్ కీపర్), 2.కైల్ మేయర్స్, 3.షమర్ బ్రూక్స్, 4.బ్రాండన్ కింగ్, 5.నికోలస్ పూరన్ (కెప్టెన్), 6.రోవ్‌మాన్ పావెల్, 7.రొమారియో షెపర్డ్, 8.అకేల్ హోసేన్, 9.హేడెన్ వాల్ష్, 10.అల్జారీ జోసెఫ్, 11.జేడెన్ సీల్స్.

Story first published: Sunday, July 24, 2022, 21:31 [IST]
Other articles published on Jul 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+