India vs WestIndies : ఓయ్ మెక్కాయ్ ఏంటీ తొండాట.. ఐపీఎల్లో సేమ్ టీం అనా.. లేక ఫిక్సింగా..?

వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరుగుతున్న తొలి టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇండియా బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 190పరుగుల భారీ స్కోరు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ (64పరుగులు 44బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు), దినేష్ కార్తీక్ (41పరుగులు 19బంతుల్లో 4ఫోర్లు, సిక్సర్ నాటౌట్) అదరగొట్టారు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 2, ఒబెడ్ మెక్కాయ్, జాసన్ హోల్డర్, అకెట్ హోసెన్, కీమో పాల్ తలా ఓ వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. దినేష్ కార్తీక్, అశ్విన్ క్రీజులో ఉన్న టైంలో ఓ సులువైన రనౌట్‌ను మెక్కాయ్ మిస్ చేశాడు. అయితే అది కాస్త అనుమానాస్పదంగా రిప్లేలో కన్పించింది. ఏదో అనుకోకుండా జరిగిందని ఓ వైపు.. ఏమైనా ఫిక్సింగ్ కోణముందా అని మరోవైపు అనుమానాలు కలుగుతున్నాయి.
అసలేం జరిగిందంటే..
తొలి ఇన్నింగ్స్ 18వ ఓవర్ బౌలింగ్ మెక్కాయ్ బౌలింగ్ వేశాడు. ఆ ఓవర్లో దినేష్ కార్తీక్ స్ట్రైయిట్ డ్రైవ్ ఆడాడు. ఇక ఆ షాట్‌కు రెండు పరుగులు తీసే క్రమంలో రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ సైడ్ డేంజర్ ఎండ్‌లో ఉన్నాడు. ఇక స్ట్రెయిట్లో ఉన్న ఫీల్డర్ చాకచక్యంగా బాల్ అందుకుని బౌలర్ వైపు బాల్ వేశాడు. మెక్కాయ్ బాల్‌ను అందుకున్నాడు. అప్పటికీ అశ్విన్ ఇంకా క్రీజుకు చాలా దూరంలో ఉన్నాడు. అయితే మెక్కాయ్ మాత్రం చేతిలో బాల్ పట్టుకుని అశ్విన్ డైవ్ చేయడం చూశాడు కానీ వికెట్లను గిరటేయలేదు. బెయిల్స్ గిరటేస్తే అది చాలా ఈజీ ఔట్. కానీ మెక్కాయ్ ఆ పని ఎందుకు చేయలేదో అస్సలు అర్థం కావడం లేదు.
గుడ్లప్పగించి చూసినా కానీ ఔట్ చేయలే
ఈ విషయమై పలు అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. అల్రెడీ అశ్విన్ క్రీజులోకి వచ్చేడేమో ఇక ఎందుకు బెయిల్స్ పడగొట్టడం అని మెక్కాయ్ అనుకున్నాడా అని ఓ పక్క అనిపిస్తుంది. అయితే అశ్విన్ డైవ్ చేస్తున్నప్పుడు గుడ్లప్పగించి అతను చూడడం వల్ల అనుమానాలు బలపడుతున్నాయి. ఏదైనా ఫిక్సింగ్ కోణం జరిగిందా.. లేక అనుకోకుండా అలా జరిగిందా అనేది తేలాల్సిందే.
నెటిజన్ల వింత వింత పోస్టులు
ఈ విషయమై నెటిజన్లు వింతవింతగా స్ందిస్తున్నారు. ఐపీఎల్లో ఇద్దరు రాజస్థాన్ తరఫున ఆడిన ప్లేయర్లు కదా.. కాస్త ఆ మాత్రం హెల్ప్ చేసుకుంటారు అంటూ పోస్టులు పెడుతున్నారు. ఫ్రెండ్సిప్ డే దగ్గర పడుతుంది కదా.. తన టీంమేట్‌కు మెక్కాయ్ ఈ రకంగా గిఫ్ట్ ఇచ్చాడనుకోవచ్చు అని మరొకరు పోస్ట్ చేశారు. అంటే మీరు మీరు ఒకటని ఫిక్స్ అయిపోయారా అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇక ఈ విషయమై ట్విట్టర్లో చర్చలు కూడా జోరందుకున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications