Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Western Australia : ప్రాక్టీస్ మ్యాచ్‌లో సూర్యకుమార్ హాఫ్ సెంచరీ.. తొలుత భారత్ బ్యాటింగ్, స్కోరు..?

 India vs Western Australia : Suryakumars half century in the practice match Helps India to Score 158

టీ20 ప్రపంచ‌కప్‌కు ముందు వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో మొదటి ప్రాక్టీస్ గేమ్‌లో టీమిండియా నేడు తలపడుతోంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం కానీ లైవ్ స్కోరు బోర్డు గానీ అందుబాటులో లేవు. అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ స్కోరు అప్డేట్ విత్ కామెంట్రీ అందించగా.. ట్విట్టరులో పలు క్రికెట్ సంబంధింత హ్యాండిల్స్ స్కోరు అప్డేట్లను అందించాయి. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా టీ20 ప్రపంచకప్ కోసం సన్నాహకంగా.. WACA గ్రౌండ్లో వెస్టర్న్ ఆస్ట్రేలియాతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఇక తొలి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. ఉదయం 11గంటలకు ప్రారంభమైంది. ఈ ప్రాక్టీస్ గేమ్‌ల తర్వాత.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మెయిన్ జట్లతో రెండు వార్మప్ మ్యాచ్‌లను భారత్ ఆడనుంది.

ఇక తొలి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20ఓవర్లలో 20ఓవర్లకు 6వికెట్లు కోల్పోయి 158పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీకి జట్టు మేనేజ్ మెంట్ విశ్రాంతినిచ్చింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (52 పరుగులు 35బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు) హాఫ్ సెంచరీతో తన ఫామ్ కొనసాగించగా.. హార్దిక్ పాండ్యా (29పరుగులు 20బంతుల్లో) రాణించాడు. దీపక్ హుడా (22), దినేష్ కార్తీక్ (20 నాటౌట్), అక్షర్ పటేల్ (10) పర్వాలేదనిపించగా.. ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ (3), పంత్ (9) పూర్తిగా నిరాశపరిచారు. వెస్టర్న్ ఆసీస్ బౌలర్లలో జాసన్ బెహ్రండార్ఫ్, మాథ్యూ కెల్లీ, ఆండ్రూ టై వికెట్లు తీశారు.

ఇరు జట్లు :
వెస్ట్రన్ ఆస్ట్రేలియా : : డి'ఆర్సీ షార్ట్, నిక్ హాబ్సన్, ఆరోన్ హార్డీ, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, ఆష్టన్ టర్నర్, సామ్ ఫానింగ్, హమీష్ మెకెంజీ, ఝీ రిచర్డ్‌సన్, ఆండ్రూ టై, మాథ్యూ ఇలేల్లీ, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్
ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

Story first published: Monday, October 10, 2022, 13:18 [IST]
Other articles published on Oct 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+