Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs W.Australia 2nd T20I : అశ్విన్ స్పిన్ మాయాజాలం.. ఒకే ఓవర్లో 3వికెట్లు..! ఇండియాకు టఫ్ టార్గెట్

 India vs Western Australia : 3 Wickets In A Over of Ashwin Helps India To limit the W.Australia Score

ఇండియా వర్సెస్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా మధ్య రెండో వార్మప్ మ్యాచ్ పెర్త్‌లోని వాకా గ్రౌండ్‌లో జరుగుతుంది. రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్‌ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టర్న్ ఆస్ట్రేలియా తొలుత 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 168పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో 17వ ఓవర్లో మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. అలాగే మిగతా బౌలర్లలో అర్షదీప్ సింగ్ 1, హర్షల్ పటేల్ 2 వికెట్లు తీశారు.

అదరగొట్టిన హబ్సన్, షార్ట్

ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్ జోష్ ఫిలిప్ (8) అర్షదీప్ బౌలింగ్లో తొందరగానే ఔటయినప్పటికీ.. రెండో వికెట్‌కు నికోలసన్ హబ్సన్ (64పరుగులు 41బంతుల్లో) చెలరేగి ఆడాడు. అలాగే డీ ఆర్సీ షార్ట్ (52పరుగులు 38బంతుల్లో) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. వీరిద్దరు సుమారు 100పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే హర్షల్ పటేల్ బౌలింగ్లో హబ్సన్ ఔట్ కాగా.. షార్ట్ రనౌట్ అవ్వడంతో వీరి పార్ట్ నర్ షిప్ బ్రేక్ అయింది. ఇక చివర్లో 17వ ఓవర్లో అశ్విన్ హ్యాట్రిక్ మిస్సయ్యాడు. అతను తొలి బంతికి టర్నర్ (2), రెండో బంతికి ఫాన్నింగ్‌ (0)లను ఔట్ చేశాడు. ఇక మూడో బంతికి సింగిలొచ్చింది. నాలుగో బంతికి మళ్లీ కెమరూన్‌ బాన్ క్రాఫ్ట్ (6)ను ఔట్ చేయడంతో ఆ ఓ వర్లో మూడు వికెట్లు సహా 2పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో స్కోరు బోర్డుకు కాస్త కళ్లెం పడింది. అయితే చివర్లో హెచ్ జి మెకంజీ (15పరుగులు 11బంతుల్లో) కాస్త విలువైన పరుగులు జోడించడంతో 8వికెట్లు కోల్పోయి వెస్టర్న్ ఆస్ట్రేలియా 168పరుగులు చేయగలిగింది. ఇక 169పరుగుల లక్ష్యాన్ని ఇండియా ఛేదిస్తుందో లేదో చూడాలి.

రోహిత్ శర్మ ఉన్నా కేఎల్ రాహుల్ కెప్టెన్సీ

ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నప్పటికీ.. కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఈ మ్యాచ్‌లో వ్యవహరిస్తున్నాడు. ఇకపోతే తొలి మ్యాచ్‌కు కేఎల్ రాహుల్ రెస్ట్ తీసుకున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 52 పరుగులతో) రాణించడంతో..13 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. రోహిత్ శర్మ, రిషబ్ పంత్ తొలి మ్యాచ్‌లో విఫలమయ్యారు. ఇక రెండో మ్యాచ్‌లోనైనా వారి నుంచి ఆశాజనక ప్రదర్శన వస్తుందో లేదో.

తుది జట్లు :

ఇండియా ప్లేయింగ్ 11 : రోహిత్, రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్సర్ పటేల్, హర్షల్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్

వెస్టర్న్ ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11: టై, ఫిలిప్, కెంజీ, ఫానింగ్, కెమరూన్ బాన్‌క్రాఫ్ట్, టర్నర్, షార్ట్, హాబ్సన్, కెల్లీ, బెహ్రెన్‌డార్ఫ్, మూడీ, మోరిస్

Story first published: Thursday, October 13, 2022, 13:18 [IST]
Other articles published on Oct 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+