For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో అరుదైన రికార్డు.. వికెట్‌ దూరంలో చహల్‌!!

India vs West Indies: Yuzvendra Chahal one wicket away from setting T20I record for India

ముంబై: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండు మ్యాచ్‌లలో భారత్, వెస్టిండీస్‌ తలో మ్యాచ్ గెలిచి సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్నాయి. ఇక ఇరు జట్ల మధ్య బుధవారం రాత్రి వాంఖడే మైదానంలో చివరిదైన మూడో మ్యాచ్‌ జరగనుంది. గత మ్యాచ్‌ విజయం ఇచ్చిన ఉత్సాహంలో విండీస్‌ సమరానికి సై అంటుంటే.. తొలి టీ20లో గెలిచినా ఫీల్డింగ్‌ సమస్యలతో సతమతమవుతున్న టీమిండియా సిరీస్‌ ఒడిసి పట్టాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

వికెట్‌ దూరంలో చహల్‌:

వికెట్‌ దూరంలో చహల్‌:

మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా మణికట్టు స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ అరుదైన ఘనతను అందుకోనున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచేందుకు చహల్‌ మరో వికెట్‌ దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం అత్యధిక వికెట్లు (52) తీసిన స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌తో సమానంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ లేడు కాబట్టి అరుదైన ఘనతను సాధించే అవకాశం చహల్‌ ముందుంది.

అశ్విన్ సరసన:

అశ్విన్ సరసన:

తొలి టీ20 మ్యాచ్‌లో జస్ప్రిత్‌ బుమ్రా (51 వికెట్లు) రికార్డును చహల్‌ అధిగమించాడు. అనంతరం మరో వికెట్ తీసి అశ్విన్ సరస చేరాడు. అయితే రెండో టీ20 మ్యాచ్‌లో 3 ఓవర్లు వేసి 36 పరుగులు ఇచ్చిన చహల్‌.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక అశ్విన్‌ 46 మ్యాచుల్లో 52 వికెట్లు తీయగా.. చహల్‌ 35 మ్యాచుల్లోనే పడగొట్టడం విశేషం. శ్రీలంక స్పి​న్నర్‌ అజంత మెండీస్‌ 26 మ్యాచ్‌లలోనే 50 వికెట్లు తీసాడు.

అగ్రస్థానంలో మలింగ:

అగ్రస్థానంలో మలింగ:

టీ20ల్లో ఇప్పటివరకు 32 మంది బౌలర్లు 50కి పైగా వికెట్లు సాధించారు. ఈ జాబితాలో టీమిండియా తరుపున అశ్విన్‌, బుమ్రా, చహల్‌లు ఉన్నారు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో లంక పేసర్ లసిత్ మలింగ (106) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆఫ్రిది (98), షకీబ్ (92), ఉమర్ గుల్ (85), సయీద్ అజ్మల్ (85)లు టాప్-5లో ఉన్నారు. టాప్-5లో ముగ్గురు పాక్ బౌలర్లు ఉండడం విశేషం.

వైరల్ ఫొటోలు.. చెల్లెలి మెహందీ వేడుకలో సానియా హొయలు!!

https://telugu.mykhel.com/tennis/sania-mirza-s-pictures-from-sister-anam-mirza-s-mehendi-shine-on-social-media/articlecontent-pf37923-025168.html

రెండు మార్పులు:

రెండు మార్పులు:

బుధవారం వాంఖడే మైదానంలో సిరీస్ డిసైడర్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌-1లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా రెండు మార్పులు చేసే అవకాశం ఉంది. భారీగా పరుగులు ఇస్తున్న దీపక్‌ చాహర్‌ స్థానంలో మొహమ్మద్ షమీని తీసుకునే అవకాశం ఉంది. వాషింగ్టన్‌ సుందర్‌ గత ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 3 వికెట్లే పడగొట్టాడు. దీంతో సుందర్‌ బదులు కుల్‌దీప్‌ను పరీక్షించినా ఆశ్చర్యం లేదు.

Story first published: Wednesday, December 11, 2019, 15:44 [IST]
Other articles published on Dec 11, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+