బుమ్రా రికార్డు బద్దలు.. అశ్విన్ రికార్డు సమం!!

హైదరాబాద్: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా మణికట్టు స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20 ఫార్మట్‌లో టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు (52) తీసిన ఆటగాడిగా మరో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరసన చేరాడు. విండీస్ బ్యాట్స్‌మన్ హెట్‌మైర్ వికెట్ సాధించడంతో చహల్ ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

26 మ్యాచ్‌ల్లోనే 50 వికెట్లు:
పేసర్ జస్ప్రిత్ బుమ్రా (51 వికెట్లు) రికార్డును కూడా చహల్ అధిగమించాడు. విండీస్ బ్యాట్స్‌మెన్ పొలార్డ్‌ను పెవిలియన్‌కు చేర్చడంతో బుమ్రా (51 వికెట్లు) రికార్డును బద్దలు కొట్టాడు. అయితే అశ్విన్ 46 మ్యాచుల్లో 52 వికెట్లు తీయగా.. చహల్ 35 మ్యాచుల్లోనే పడగొట్టడం విశేషం. శ్రీలంక స్పిన్నర్ అజంత మెండీస్ 26 మ్యాచ్‌లలోనే 50 వికెట్లు తీసాడు.

ఒక్క వికెట్ తీసినా రికార్డులోకి చహల్:
టీ20ల్లో ఇప్పటివరకు 32 మంది బౌలర్లు 50కి పైగా వికెట్లు సాధించారు. ఈ జాబితాలో టీమిండియా తరుపున అశ్విన్, బుమ్రా, చహల్‌లు ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో విండీస్ బ్యాట్స్‌మెన్ పొలార్డ్, హెట్‌మెయిర్‌ను ఒకే ఓవర్‌లో చహల్ పెవిలియన్‌కు చేర్చిన విషయం తెలిసిందే. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌లుగా అశ్విన్, చహల్‌లు ఉన్నారు. రెండో టీ20లో ఒక్క వికెట్ తీసినా చహల్ రికార్డులోకి ఎక్కుతాడు.

తిరువనంతపురంలో రెండో టీ20:
విండీస్‌తో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. హెట్‌మెయిర్ (56), లూయిస్ (40) రాణించారు. భారత బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీసాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలోనే ఛేదించింది. విరాట్ కోహ్లీ (94*) చెలరేగగా.. రాహుల్ (62) రాణించాడు. తిరువనంతపురంలో ఆదివారం రెండో టీ20 జరగనుంది.

కోహ్లీపై ప్రశంసల జల్లు:
వెస్టిండీస్‌పై విశ్వరూపం ప్రదర్శించిన కోహ్లీ (50 బంతుల్లో 94 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు)పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. అసాధ్యం అనుకున్న లక్ష్యాన్ని కోహ్లీ సాధించాడని మాజీ క్రికెటర్లు ప్రశంసింస్తున్నారు. వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు రిచర్డ్స్ కొనియాడాడు. కోహ్లీ ఆట అద్భుతం.. మహా అద్భుతం అంటూ ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications