
వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన
అంతేకాదు, వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మకు అరుదైన గుర్తింపు లభిస్తుంది. రోహిత్ శర్మ ఇప్పటివరకు 210 వన్డేలు ఆడి 224 సిక్సర్లు బాదాడు. కాగా, ప్రస్తుతం ధోని ఖాతాలో 225 సిక్సర్లు ఉన్నాయి. ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరడంతో రికార్డు మిస్సయ్యాడు.

అగ్రస్థానంలో షాహిద్ ఆఫ్రిది
ఈ నేపథ్యంలో గురువారం మాంచెస్టర్ వేదికగా వెస్టిండిస్‌తో జరగనున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈ రికార్డు అందుకోవాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. కాగా, వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో పాక్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది(351) అగ్రస్థానంలో ఉండగా... క్రిస్‌గేల్(324) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

టాప్-5లో ఒకే ఒక్కడు రోహిత్ శర్మ
శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ సనత్ జయసూర్య 270 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. 250 కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడి ఈ జాబితాలో టాప్-5లో నిలిచిన ఒకే ఒక్కడు రోహిత్ శర్మనే కావడం విశేషం. ఇక, ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ చక్కటి ఫామ్‌లో కొనసాగుతున్నాడు.

4 మ్యాచ్‌లు ఆడి 320 పరుగులు చేసిన రోహిత్
ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 320 పరుగులు చేశాడు. దీంతో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. ఇందులో రెండు సెంచరీలతో పాటు ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఇక, టోర్నీలో రోహిత్ శర్మ ఇప్పటివరకు 30 ఫోర్లు, 6 సిక్సులు బాదాడు.


Click it and Unblock the Notifications












