Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌తో సిరీస్‌: హోప్‌, జోసెఫ్‌లపై వేటు.. విండీస్‌ టీ20, వన్డే జట్లు ఇవే!!

India vs West Indies: West Indies names ODI and T20 squad, Kieron Pollard To Lead Teams

ఆంటిగ్వా: వచ్చే నెలలో వెస్టిండీస్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో టీమిండియా-విండీస్ జట్లు 3 టీ20లు, 3 వన్డే మ్యాచ్‌లు ఆడనున్నాయి. తొలుత టీ20 సిరీస్ జరగనుంది. డిసెంబర్ 6న హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్‌తో ఈ పర్యటన ప్రారంభం కానుంది. ఇక డిసెంబర్ 22న కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగే మూడో వన్డేతో పర్యటన పూర్తవుతుంది.

హోప్‌, జోసెఫ్‌లపై వేటు:

హోప్‌, జోసెఫ్‌లపై వేటు:

భారత్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం వెస్టిండీస్‌ బోర్డు గురువారం జట్లను ప్రకటించింది. రెండు ఫార్మాట్లకు సీనియర్ ఆటగాడు కీరన్‌ పొలార్డ్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గాయం నుంచి కోలుకున్న ఫాబియెన్‌ ఆలెన్‌, దినేశ్‌ రామ్‌దిన్‌ టీ20 జట్టులోకి వచ్చారు. ఇటీవల అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో విఫలమయిన షాయ్‌ హోప్‌, అల్జరి జోసెఫ్‌లపై విండీస్ బోర్డు వేటు వేసింది. అయితే ఈ ఇద్దరు వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు.

 భారత్‌కు పోటీ ఇస్తాం:

భారత్‌కు పోటీ ఇస్తాం:

జట్టు ఎంపికపై ప్రధాన కోచ్ ఫిల్ సిమన్స్ మాట్లాడుతూ... 'రెండు ఫార్మాట్‌లో మాకు మూడు మ్యాచ్‌లు ఉన్నాయి. భారత్‌కు పోటీ ఇచ్చే జట్లనే ఎంపికచేశాం. ఆఫ్ఘనిస్తాన్‌ చేతిలో టీ20 సిరీస్ ఓడిపోవడం అగౌరవం ఏమీ కాదు. ఆటలో ఇవన్నీ సహజమే. కానీ.. టీమిండియా పటిష్ట జట్టు కాబట్టి ఎదుర్కోవడం మరింత కష్టమవుతుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డేల్లో 3-0తో సిరీస్ విజయం సాధించాం. అదే ఆత్మవిశ్వాసంతో ముందుకువెళతాం. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టును ఎంపికచేశాం' అని తెలిపాడు.

 టీ20 జట్టు:

టీ20 జట్టు:

ఫాబియాన్‌ లెన్‌, బ్రాండన్‌ కింగ్‌, రామ్‌దిన్‌, కాట్రెల్‌, ఎవిన్‌ లూయిస్‌, రూథర్‌ఫర్డ్‌, కీరన్‌ పొలార్డ్‌ (కెప్టెన్‌), హెట్‌మయెర్‌, ఖారీ పియెర్రె, సిమ్మన్స్‌, హోల్డర్‌, హేడెన్‌ వాల్ష్‌, కీమో పాల్‌, నికోలస్‌ పూరన్‌, కెస్రిక్‌ విలియమ్స్‌.

వన్డే జట్టు:

వన్డే జట్టు:

సునీల్‌ ఆంబ్రోస్‌, షాయ్‌ హోప్‌, ఖారీ పియెర్రె, రోస్టన్‌ చేజ్‌, అల్జారీ జోసెఫ్‌, కీరన్‌ పొలార్డ్‌ (కెప్టెన్‌), కాట్రెల్‌, బ్రాండన్‌ కింగ్‌, నికోలస్‌ పూరన్‌, హెట్‌మయెర్‌, ఎవిన్‌ లూయిస్‌, షెపర్డ్‌, హోల్డర్‌, కీమో పాల్‌, హేడెన్‌ వాల్ష్‌.

Story first published: Friday, November 29, 2019, 9:38 [IST]
Other articles published on Nov 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+