
ఆటగాళ్లు దాదాపు భారత్‌తో పర్యటనకు
ఈ క్రమంలో విండీస్ ఆటగాడు రామ్‌దిన్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టును మళ్లీ పునర్ నిర్మించడం కష్టంతో కూడిన పని. ప్రపంచవ్యాప్తంగా టీ20ల్లో మా విండీస్ ఆటగాళ్లకు మంచి డిమాండ్ ఉంది. ఆ కారణం చేతనే మా జట్టులోని ఆటగాళ్లు దాదాపు భారత్‌తో పర్యటనకు దూరమయ్యారు. ఫలితంగా సీనియర్లు లేని జట్టుతో బరిలోకి దిగడంతో టీ20 సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది.

సీనియర్ క్రికెటర్లు పర్యటనకి విముఖత
ప్రపంచవ్యాప్తంగా వెస్టిండీస్ క్రికెటర్లకి టీ20ల్లో మంచి డిమాండ్ ఉంది. కానీ.. ఇదే ఫార్మాట్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో మేము భారత్ చేతిలో పేలవంగా ఓడిపోయి 0-2తో నిలిచాం. దీనికి కారణం.. మా జట్టులోని కొంతమంది సీనియర్ క్రికెటర్లు భారత్ పర్యటనకి విముఖత చూపడమే' అని దినేశ్ రామ్‌దిన్ వెల్లడించాడు. ఐపీఎల్, సీపీఎల్ లాంటి ప్రైవేట్ లీగ్‌లో ఆడేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్న క్రిస్‌గేల్, సునీల్ నరైన్, డారెన్ బ్రావో, ఆండ్రీ రసెల్ తదితర క్రికెటర్లు.. వెస్టిండీస్ తరఫున ఆడేందుకు మాత్రం సాకులు చెప్తూ దూరంగా ఉంటున్నారు.

దురదృష్టవశాత్తు అతనిని ఎదుర్కొలేక
మరోవైపు చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ను ఎదుర్కోవడంలోనూ మా బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడ్డారు. ఈ సిరీస్‌లో అతను కీలక పాత్ర పోషించాడు. మిడిల్ ఓవర్లలో అతను ఎప్పటికీ ప్రమాదకర బౌలరే. దురదృష్టవశాత్తు అతనిని ఎదుర్కొలేకపోయాం. షైహోప్, హెట్‌మెయిర్ అతడిని కాస్త ఎదుర్కోగలిగారు. వారి శక్తి మేరకు కుల్‌దీప్ వేసే బంతులను షాట్లుగా మలచడానికి ప్రయత్నించారు. ఆదివారం మ్యాచ్‌లో స్పిన్నర్లే కీలక పాత్ర పోషిస్తారు' అని చెప్పుకొచ్చాడు.

చివరి మ్యాచ్‌లో స్పిన్నర్లు కీలకమని ఆశిస్తున్నా
'మైదానం పరంగా చూస్తే వెస్టిండీస్‌కు భారత్ మధ్య చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. క్రమంగా ఊపందుకుని మ్యాచ్ మలుపు తిప్పాయి. చివరి మ్యాచ్‌లో స్పిన్నర్లు కీలకంగా రాణించగలరని ఆశిస్తున్నా. మా క్రికెటర్లకు ఫస్ట్ క్లాస్ ఆడిన అనుభవం చాలా తక్కువగా ఉంది. వారిలో కొందరు గాయాల కారణంగా మ్యాచ్‌కు అందుబాటులో లేరు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ మరింత నైపుణ్యమున్న ఆటగాళ్లను తయారుచేస్తుంది. మరి కొద్ది రోజుల్లో టీ20, 50 ఓవర్ల ఫార్మాట్‌లలో వెస్టిండీస్ మరింతగా వృద్ధి చెందుతుందని' ఆశాభావం వ్యక్తం చేశాడు.


Click it and Unblock the Notifications
