'ఇందనం లేకుండానే పరుగులు తీస్తున్నాం'


హైదరాబాద్: భారత్ చేతిలో ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌ని 0-2తో చేజార్చుకున్న వెస్టిండీస్ జట్టు.. ఐదు వన్డేల సిరీస్‌లోనూ 1-3 తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో.. కనీసం ఈ మూడు టీ20ల సిరీస్‌లోనైనా గెలవాలని కరీబియన్ టీమ్ ఆశిస్తోంది. వన్డే సిరీస్‌లో ఓటమి పాలైనప్పటికీ తమ ఆటగాళ్లు మంచి అనుభవం సంపాదించారని వెస్టిండీస్ కోచ్ స్టువర్ట్ లా అన్నారు. తొలి మూడు వన్డేలకే వారిలో ఇంధనం పూర్తిగా ఖర్చైపోయిందని పేర్కొన్నారు.

కుర్రాళ్లు తెలివైన వారు. నైపుణ్యం ఉంది
‘మా కుర్రాళ్లు తెలివైన వారు. నైపుణ్యం ఉంది. ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకొనే అనుభవం వారికి రావాలి. నలభైవేల మంది అభిమానులు స్టేడియాన్ని హోరెత్తిస్తుంటే అత్యుత్తమ జట్టుతో తలపడడం అంత సులువు కాదు. ఒత్తిడి మనతో పిచ్చి పనులు చేయిస్తుంది. ఆ పరిస్థితులను అనుభవిస్తే అలవాటవుతుంది. ఈ పర్యటనలో భారత్ నుంచి విండీస్ చాలా నేర్చుకుంది. అందుకు ఇంత కన్నా మంచి జట్టు దొరకదు.

బంగ్లాదేశ్ రూపంలో మాకు ఓ అవకాశం
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బ్యాటింగ్‌ను చూడటం కన్నా గొప్ప ఏముంటుంది? బుమ్రా అద్భుతంగా బంతులేశాడు. జడేజా శ్రమించాడు. కుల్‌దీప్ మళ్లీ తన మాయ కొనసాగించాడు. గెలవాలంటే నైపుణ్యం మాత్రమే సరిపోదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. త్వరలో బంగ్లాదేశ్ రూపంలో మాకు ఓ అవకాశం ఉంది. యువ ఆటగాళ్లు షై హోప్, హెట్‌మైయిర్ అద్భుతంగా ఆడారు. కొత్త కుర్రాడు థామస్ ఆకట్టుకున్నాడు.

మూడు గంటలు బ్యాటింగ్ ప్రాక్టీస్
టెస్టు, వన్డే జట్టులో లేని కార్లోస్ బ్రాత్‌వైట్, డారెన్ బ్రావో, దినేశ్ రామ్‌దిన్, పొలార్డ్ తదితరులు గురువారం ప్రాక్టీస్ సెషన్‌లో ఎక్కువగా హిట్టింగ్ ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. 2016 టీ20 ప్రపంచకప్ ఫైనల్.. ఆఖరి ఓవర్‌లో ఈ వేదికగానే వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన బ్రాత్‌వైట్ గురువారం దాదాపు మూడు గంటలు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడట. మరోవైపు ఏడాది తర్వాత మళ్లీ వెస్టిండీస్ టీ20 జట్టులో బ్రావో, పొలార్డ్ ఆడుతున్నారు.

టీ20లకు ఆడనున్న వెస్టిండీస్ జట్టు:
కార్లొస్ బ్రాత్‌వైట్(కెప్టెన్), ఫాబియనె అల్లెన్, డారెన్ బ్రావో, షిమ్రెన్ హేట్‌మెయర్, ఎవిన్ లూయీస్, మెకొకొయ్, ఆశ్లీ నర్స్, కీమో పాల్, ఖారీ ఫిర్రె, కీరన్ పొలార్డ్, రొమన్ పొవెల్, దానేశ్ రాందిన్, ఆండ్రీ రస్సెల్, షెర్పాన్ రూథర్ ఫర్డ్, ఒషాన్ థామస్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications