
అహ్మదాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇప్పటికే ఫేలవ ఫామ్‌తో సతమతమవుతున్న విరాట్ కోహ్లీ వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాడు. మూడో వన్డేలో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఆరంభించింది. కాసేపటికి 4వ ఓవర్‌లో విండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. తొలి బంతిని డాట్ బాల్ చేశాడు. ఇక రెండో బంతిని జోసెఫ్.. కోహ్లీ వెనుక భాగంవైపుగా వేశాడు. అయితే ఆ బంతిని ఆడడంలో విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. బంతిని రైట్ సైడ్ బాదే క్రమంలో తడబడ్డాడు. దీంతో బంతి కోహ్లీ బ్యాట్‌కు తగిలి విండీస్ వికెట్ కీపర్ షాయ్ హోప్ చేతిలో పడింది. దీంతో కోహ్లీ ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్ అయ్యాడు.
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ డకౌట్ కావడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఈ క్రమంలో కొందరు కోహ్లీపై ట్రోలింగ్స్ మొదలుపెట్టారు. కోహ్లీ పనైపోయిందంటూ రాసుకొస్తున్నారు. మరికొందరైతే రోహిత్ శర్మ కెప్టెన్సీలో కోహ్లీ కావాలనే ఆడడం లేదని మండిపడుతున్నారు. కాగా ఈ సిరీస్ మొత్తంలో కోహ్లీ బ్యాటర్‌గా విఫలమయ్యాడు. తొలి వన్డే మ్యాచ్‌లో 8 పరుగులే చేసిన కోహ్లీ, రెండో వన్డేలో 18 పరుగులు చేశాడు. దీంతో సిరీస్ మొత్తంలో కోహ్లీ చేసింది 26 పరుగులే. దీంతో కోహ్లీ ఫాంపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాగా మూడో వన్డేలో టీమిండియా 42 పరుగులకే 3 వికట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఫోర్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో 13 పరుగులకే ఔటయ్యాడు. అదే ఓవర్‌లో కోహ్లీ డకౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ కాసేపు ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. కానీ ఈ క్రమంలో జట్టు స్కోర్ 42 పరుగుల వద్ద ఉండగా 10 పరుగులు చేసిన ధావన్‌ను ఓడియన్ స్మిత్ ఔట్ చేశాడు.