ఒకే ఓవర్‌లో రెండు క్యాచ్‌లు మిస్: బౌండరీని తాకకుండా కోహ్లీ క్యాచ్ పట్టాడిలా! (వీడియో)

హైదరాబాద్: తిరువనంతపురం వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో టీ20లో కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. సహచర క్రికెటర్లు మైదానంలో తప్పుల మీద తప్పులు చేస్తుంటే, కోహ్లీ మాత్రం ఫీల్డింగ్‌లో చెలరేగాడు. ఏకపక్షంగా సాగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ ఓ క్యాచ్ పట్టడంతో మళ్లీ టీమిండియా రేసులోకి వచ్చింది.
దూకుడుగా ఆడుతున్న విండిస్ బ్యాట్స్‌మన్ హెట్‌మయర్.. జడేజా వేసిన ఓవర్‌లో లాంగాఫ్ వైపు భారీ షాట్ ఆడాడు. మ్యాచ్‌ని వీక్షిస్తున్న అందరూ ఫోర్ లేదా సిక్సర్ అనుకున్నారు. అయితే, ఆ సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న విరాట్ కోహ్లీ దూరం నుంచి మెరుపు వేగంతో దూసుకొచ్చిన విరాట్ డైవ్ చేస్తూ అమాంతం క్యాచ్ పట్టేశాడు.

బంతిని అందుకున్నాక
బంతిని అందుకున్నాక బౌండరీ లైన్‌కు తాకకుండా భారత కెప్టెన్ నియంత్రించుకున్న తీరు ప్రశంసనీయం. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, అంతకముందు ఒకే ఓవర్‌లో రెండు క్యాచ్‌లను భారత ఫీల్డర్లు వదిలేశారు. భువీ వేసిన ఐదో ఓవర్‌లో సిమన్స్ ఇచ్చిన క్యాచ్‌ను మిడాఫ్‌లో వాషింగ్టన్ సుందర్ వదిలేశాడు.

నేరుగా చేతుల్లోకి వచ్చిన
నేరుగా చేతుల్లోకి వచ్చిన బంతిని ఒడిసి పట్టలేక క్యాచ్‌ని నేలపాలు చేశాడు. ఆ సమయంలో 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న సిమన్స్ తనకు వచ్చిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకొని చివరి వరకు నిలిచి వెస్టిండిస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. హైదరాబాద్‌లో జరిగిన తొలి టీ20లో కూడా సుందర్ రెండు క్యాచ్‌లు జారవిడిచాడు.

ఆ తర్వాత ఒక్క బంతి తేడాతో
ఆ తర్వాత ఒక్క బంతి తేడాతో లూయిస్‌కు రిషబ్ పంత్ లైఫ్ ఇచ్చాడు. ఎడ్జ్ తీసుకున్న బంతిని డైవ్ చేసి పట్టేందుకు యత్నించిన రిషబ్ పంత్ విఫలమయ్యాడు. కాగా, ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలి టీ20లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియాకు రెండో మ్యాచ్‌లో ఓటమి తప్పలేదు.

ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా
ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా టీమిండియాకు ఓటమి తప్పలేదు. 171 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంకో 9 బంతులుండగానే ఛేదించింది. లెండిల్ సిమన్స్ (67 నాటౌట్; 45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ఆరంభంలో నెమ్మదిగా ఆడిన సిమన్స్ ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు.

ముంబైలో మూడో టీ20
మరో ఓపెనర్ లూయిస్ (40; 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులు)తో కలిసి అతను తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించాడు. ఆ తర్వాత హెట్‌మయర్ (23) అతడికి తోడుగా నిలిచాడు. రెండో వికెట్ పడ్డాక సిమన్స్‌తో కలిసి పూరన్ (38 నాటౌట్; 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) మెరుపులు మెరిపించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసింది. శివమ్ దూబె (54; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మూడో టీ20 బుధవారం ముంబైలో జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications