రెండో టీ20లో టీమిండియా ఓటమి: రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ

హైదరాబాద్: తిరువనంతపురంలో వెస్టిండిస్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ(2563) ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పొడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 19 పరుగులు చేయడంతో ఈ ఘనత సాధించాడు.
ఈ క్రమంలో రోహిత్ శర్మ(2562) అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు. ఇద్దరి మధ్య కేవలం ఒక్క పరుగు మాత్రమే వ్యత్యాసంగా ఉంది. ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో కోహ్లీ, రోహిత్‌లు ఉండగా మార్టిన్ గప్టిల్(2463, న్యూజిలాండ్), షోయాబ్ మాలిక్(2263; పాకిస్తాన్) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

కోహ్లీ మరో అరుదైన రికార్డు
ఈ మ్యాచ్‌లో కోహ్లీ మరో అరుదైన రికార్డుని మిస్సయ్యాడు. మరో ఆరు పరుగులు చేసి ఉంటే, స్వదేశంలో టీ20ల్లో వెయ్యి పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించేవాడు. ఇప్పటివరకు టీ20ల్లో స్వదేశంలో వెయ్యి పరుగులు సాధించిన ఆటగాళ్లలో మార్టిన్ గప్తిల్ (1430), కోలిన్ మన్రో (1000)లు ఉన్నారు.

8 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి
ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలి టీ20లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియాకు రెండో మ్యాచ్‌లో ఓటమి తప్పలేదు. ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా టీమిండియాకు ఓటమి తప్పలేదు. 171 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంకో 9 బంతులుండగానే ఛేదించింది.

లెండిల్ సిమన్స్ 67 నాటౌట్
లెండిల్ సిమన్స్ (67 నాటౌట్; 45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ఆరంభంలో నెమ్మదిగా ఆడిన సిమన్స్ ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. మరో ఓపెనర్ లూయిస్ (40; 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులు)తో కలిసి అతను తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించాడు.

ముంబైలో బుధవారం మూడో టీ20
ఆ తర్వాత హెట్‌మయర్ (23) అతడికి తోడుగా నిలిచాడు. రెండో వికెట్ పడ్డాక సిమన్స్‌తో కలిసి పూరన్ (38 నాటౌట్; 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) మెరుపులు మెరిపించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసింది. శివమ్ దూబె (54; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మూడో టీ20 బుధవారం ముంబైలో జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications