Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND v WI: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త‌ రికార్డులు.. వీరేంద్ర సెహ్వాగ్‌ను అధిగ‌మించి మ‌రి న‌మోదు

India vs West Indies: Virat Kohli Second Place in Most Duck outs Indian Batters list

అహ్మ‌దాబాద్‌: వెస్టిండీస్‌తో మూడో వ‌న్డే మ్యాచ్‌లో డ‌కౌట్ కావ‌డం ద్వారా టీమిండియా వెట‌ర‌న్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ రెండు చెత్త రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్ర‌మంలో టీమిండియా దిగ్గ‌జ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ చెత్త రికార్డును కూడా బ్రేక్ చేశాడు. మూడో వ‌న్డేలో డ‌కౌట్ కావ‌డం ద్వారా వ‌న్డేల్లో అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయినా వీరేంద్ర సెహ్వాగ్‌, సురేష్ రైనా చెత్త రికార్డును కోహ్లీ అధిగ‌మించాడు.

డ‌కౌట్ల‌లో మూడో స్థానంలో

డ‌కౌట్ల‌లో మూడో స్థానంలో

నేడు అయినా డ‌కౌట్‌తో వ‌న్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ మొత్తం 15 సార్లు డ‌కౌట్ అయ్యాడు. దీంతో వ‌న్డేల్లో ఇప్ప‌టివ‌ర‌కు 14 సార్లు డ‌కౌట్ అయినా వీరేంద్ర సెహ్వాగ్‌, సురేష్ రైనాను కోహ్లీ అధిగ‌మించాడు. అలాగే వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయినా భార‌త ఆట‌గాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో స‌చిన్ టెండూల్క‌ర్ 20 డ‌కౌట్ల‌తో మొద‌టి స్థానంలో ఉన్నాడు. ఇక 18 డ‌కౌట్ల‌తో యువ‌రాజ్ సింగ్ రెండో స్థానంలో, 16 డకౌట్ల‌తో సౌర‌వ్ గంగూలీ మూడో స్థానంలో ఉన్నాడు. అయితే ఇది 1వ స్థానం నుంచి 7వ స్థానం వ‌ర‌కు ఆడిన బ్యాట‌ర్ల జాబితాను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఈ జాబితాను లెక్కించారు.

మొత్తంగా

మొత్తంగా

ఇక అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి ఎక్కువ సార్లు డ‌కౌట్ అయినా భార‌త ఆట‌గాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు. అంత‌కుముందు వీరేంద్ర సెహ్వాగ్ 31 డ‌కౌట్ల‌తో రెండో స్థానంలో ఉండ‌గా 32 డ‌కౌట్ల‌తో కోహ్లీ అత‌డిని అధిగ‌మించాడు. ఈ జాబితాలో 34 డ‌కౌట్ల‌తో టీమిండియా దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ మొద‌టి స్థానంలో ఉన్నాడు. ఇక 29 డ‌కౌట్ల‌తో సౌర‌వ్ గంగూలీ నాలుగో స్థానంలో, 26 డ‌కౌట్ల‌తో యువ‌రాజ్ సింగ్ ఐదో స్థానంలో ఉన్నాడు. అయితే ఈ జాబితాను 1వ స్థానం నుంచి 7వ స్థానం వ‌ర‌కు ఆడిన బ్యాట‌ర్ల జాబితాను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని లెక్చించారు.

ఆదుకున్న అయ్య‌ర్‌, పంత్‌

ఆదుకున్న అయ్య‌ర్‌, పంత్‌

ఇక అహ్మ‌దాబాద్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌ర‌గుతున్న మూడో వ‌న్డే మ్యాచ్‌లో టీమిండియా టాపార్డ‌ర్ విఫ‌ల‌మైంది. రోహిత్ శ‌ర్మ 13, శిఖ‌ర్ ధావ‌న్ 10, విరాట్ కోహ్లీ డ‌కౌట్ అయ్యారు. దీంతో 42 ప‌రుగుల‌కే 3 కీల‌క వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన భార‌త్‌ను శ్రేయ‌స్ అయ్య‌ర్, రిష‌బ్ పంత్ ఆదుకున్నారు. వీరిద్ద‌రు నాలుగో వికెట్‌కు 110 ప‌రుగుల సెంచరీ భాగ‌స్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు హాఫ్ సెంచ‌రీలు పూర్తి చేసుకున్నారు. జ‌ట్టు స్కోర్‌ 152 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా 56 ప‌రుగులు చేసిన పంత్ ఔట్ అవ‌డంతో వీరి భాగ‌స్వామ్మానికి తెర‌ప‌డింది. అనంత‌రం సూర్య‌కుమార్ యాద‌వ్ 6 ప‌రుగుల‌కే ఔట్ అయ్యాడు. ఆ త‌ర్వాత 80 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ శ్రేయ‌స్ అయ్యర్ ఔట్ అయ్యాడు. దీంతో టీమిండియా 187 ప‌రుగుల వ‌ద్ద ఆరో వికెట్ కోల్పోయింది.

Story first published: Friday, February 11, 2022, 19:08 [IST]
Other articles published on Feb 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+