మూడో ఏడాది 1000కి పైగా: 24వ టెస్టు సెంచరీతో కోహ్లీ బద్దలు కొట్టిన రికార్డులివే


హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. 184 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 24వ సెంచరీ కావడం విశేషం. అంతేకాదు ఈ ఏడాది టెస్టుల్లో కోహ్లీకి ఇది నాలుగో సెంచరీ.
ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. 123 ఇన్నింగ్స్‌ల్లో 24వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ తర్వాత అత్యంత వేగంగా 24 టెస్టు సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 125 ఇన్నింగ్స్‌ల్లో సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.


అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీకి ఇది 50వ సెంచరీ
అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీకి ఇది 50వ సెంచరీ. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టక ముందు 250 ఇన్నింగ్స్‌ల్లో 29 సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా 134 ఇన్నింగ్స్‌ల్లోనే 30 సెంచరీలు సాధించడం విశేషం. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఖాతాలో మరో మైలురాయి వచ్చి చేరింది.
స్మిత్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ
ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లలో అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ రెండోస్థానానికి చేరుకున్నాడు. 23 సెంచరీలు చేసిన స్టీవ్ స్మిత్‌ను వెనక్కి నెట్టిన విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీం ఆమ్లా (29) తర్వాతి స్థానంలో నిలిచాడు. అదే సమయంలో టెస్టుల్లో సొంతగడ్డపై విరాట్ కోహ్లీ 3 వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు.
సొంతగడ్డపై మూడు వేల పరుగులు
ఫలితంగా సొంతగడ్డపై అత్యంత వేగంగా మూడు వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా పుజారా సరసన నిలిచాడు. దీంతో పాటు తాజా సెంచరీతో ఈ ఏడాది టెస్టుల్లో వెయ్యి పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు టెస్టులాడిన కోహ్లీ ఆ సిరీస్‌లో మొత్తం 593 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా మూడో ఏడాది టెస్టుల్లో వెయ్యి పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 2016లో 1215 పరుగులు చేసిన కోహ్లీ 2017లో 1059 పరుగులు చేశాడు.
అగ్రస్థానంలో మాథ్యూ హెడెన్
అంతర్జాతీయ క్రికెట్లో వరుస ఏడాదిల్లో సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ హెడెన్ అగ్రస్థానంలో ఉన్నాడు. మాథ్యూ హెడెన్ వరుసగా ఐదేళ్ల పాటు ప్రతి ఏటా వెయ్యికిపైగా పరుగులు చేశాడు. ఈ జాబితాలో ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ (4) ఉండగా, ట్రెస్కోథిక్, బ్రియాన్ లారా, కెవిన్ పీటర్సన్‌లు టెస్టు క్రికెట్లో వరుసగా మూడేళ్లపాటు వెయ్యికిపైగా పరుగులు చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications