Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ వికెటే ముఖ్యం.. ఔట్ చేయడానికి రెండు ప్రణాళికలు ఉన్నాయి: విండీస్ కోచ్

India vs West Indies: Virat Kohlis wicket is key, difficult proposition to get him out says Phil Simmons

హైదరాబాద్: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ మరో రోజులో ప్రారంభం కానుంది. టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాత్రి 7 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం మంగళవామే ఇరు జట్లు హైదరాబాద్ నగరానికి చేరకుని తీవ్రంగా సాధన చేస్తున్నాయి.

బోణీ కొట్టాలని:

బోణీ కొట్టాలని:

తొలి టీ20లో విజయం సాధించి సిరీస్‌లో బోణీ కొట్టాలని ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. ప్రత్యర్థులను ఓడించడానికి ఇరు జట్లు ప్రణాళికలు రచిస్తున్నాయి. టీమిండియాను ఓడించాలంటే ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టాలని వెస్టిండీస్ కోచ్ సిమన్స్ పేర్కొన్నాడు. తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న సిమన్స్‌కు కోహ్లీని ఎలా ఎదుర్కొంటారనే ప్రశ్న ఎదురైంది. దీనికి సిమన్స్‌ సరదాగా బదులిచ్చాడు.

 రెండు ప్రణాళికలు ఉన్నాయి:

రెండు ప్రణాళికలు ఉన్నాయి:

'కోహ్లీని పెవిలియన్‌కు చేర్చడానికి మా వద్ద రెండు ప్రణాళికలు ఉన్నాయి. ఒకటి.. కోహ్లీని బ్యాటుతో బదులుగా వికెట్‌తో బ్యాటింగ్‌ చేయమని అడుగుతాం. రెండోది.. అతడికి సెంచరీ చేసే అవకాశం ఇస్తాం. అయితే సెంచరీ చేసే సమయంలో క్రీజులో ఉన్న ఇతర బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌ చేస్తాం. ఎందుకంటే కోహ్లీని ఔట్‌ చేయడం ఎంతో కష్టతరం' అని సిమన్స్‌ అన్నాడు.

కోహ్లీ వికెటే ముఖ్యం:

కోహ్లీ వికెటే ముఖ్యం:

'టీమిండియాను ఓడించాలంటే ముందు కోహ్లీ వికెట్ పడగొట్టాలి. అతని వికెట్ పడగొట్టడం చాలా ముఖ్యం. అయితే అదంత సులభం కాదు. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బౌలర్లు అతి జాగ్రత్తకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎలాంటి భయం లేకుండా బంతులు సంధించాలి. అతడిని పెవిలియన్ పంపేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలున్నాయి. వాటిని అమలు చేస్తే చాలు' అని సిమన్స్ సీరియస్‌గా పేర్కొన్నాడు.

భారత్‌ను ఓడించడం అంత సులువు కాదు:

భారత్‌ను ఓడించడం అంత సులువు కాదు:

'భారత్‌లో గత ఏడాది టీ20లు, వన్డేలు ఆడాం. గత ప్రదర్శన కంటే ఈ సారి మరింత మెరుగ్గా ఆడదానికి ప్రయత్నిస్తాం. టీమిండియా ఎంతో పటిష్ఠమైన జట్టు. భారత్‌ను ఓడించడం అంత సులువు కాదు' అని సిమన్స్‌ అన్నాడు. భారత్‌తో వెస్టిండీస్‌ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. భారత్‌కు చెందిన మాంటీ దేశాయ్‌ను విండీస్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా కరీబియన్‌ బోర్డు నియమించింది. దేశాయ్‌తో రెండేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకొంది. ఇప్పటికే అతను హైదరాబాద్‌లో విండీస్ జట్టుతో చేరాడు.

Story first published: Thursday, December 5, 2019, 13:05 [IST]
Other articles published on Dec 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+