నోట్‌బుక్ సెలబ్రేషన్.. ఎందుకు చేసాడో చెప్పిన కోహ్లీ!!

హైదరాబాద్: శుక్రవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లీ (94 పరుగులు; 50 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు) 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టీ20ల్లో కోహ్లీకి ఇది 23వ హాఫ్ సెంచరీ. అయితే తొలి టీ20 మ్యాచ్‌లో ఓ అరుదైన ఘటనతో కోహ్లీ వార్తల్లో నిలిచాడు. వెస్టిండీస్ పేసర్ విలియమ్స్‌ను ఉద్దేశించి కోహ్లీ తన చేతిని వర్చువల్ 'నోట్‌బుక్'గా మార్చి టిక్ కొడుతున్నట్లు చేసిన విన్యాసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గతంలో ఓ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ వికెట్ తీసిన విలియమ్స్ నోట్‌బుక్ సంబరాలు చేసుకున్నాడు. ఇక శుక్రవార 208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా విజయానికి 30 బంతుల్లో 54 పరుగులు కావాలి. కోహ్లీ క్రీజులో ఉన్నాడు. విలియమ్స్ వేసిన 16వ ఓవర్ రెండో బంతిని అతని తలపై నుంచి కోహ్లీ నేరుగా బౌండరీ బాదాడు. ఆ తర్వాతి బంతిని లాంగాన్‌లో సిక్సర్ కొట్టాడు. సిక్సర్ కొట్టిన తర్వాత విలియమ్స్‌కు కోహ్లీ కౌంటర్ ఇచ్చాడు. కోహ్లీ తన జేబులో నుంచి నోట్‌బుక్‌ను తీసి మూడు సార్లు టిక్కులు కొడుతున్నట్లు సెలబ్రేషన్ చేసుకున్నాడు.
దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. విలియమ్స్‌కు కోహ్లీ కౌంటర్ ఇచ్చాడంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ అనంతరం దీనిపై విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... గత వెస్టిండీస్ పర్యటనలో తనని ఔట్ చేసినపుడు విలియమ్స్ చేసిన సెలబ్రేషన్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఇలా బదులిచ్చినట్లు చెప్పుకొచ్చాడు.
విండీస్‌తో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. హెట్‌మెయిర్ (56), లూయిస్ (40) రాణించారు. భారత బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీసాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలోనే ఛేదించింది. విరాట్ కోహ్లీ (94*) చెలరేగగా.. రాహుల్ (62) రాణించాడు. తిరువనంతపురంలో ఆదివారం రెండో టీ20 జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications