రికార్డు బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతోన్న ధోనీ.. కోహ్లీ.. రోహిత్‌లు

న్యూ ఢిల్లీ: వెస్టిండీస్‌పై టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. ప్రస్తుతం ఆ జట్టుతో వన్డేలకు సిద్ధమవుతోంది. తొలి వన్డే ఆదివారం గువహటి వేదికగా జరగనుంది. ఆసియా కప్ నుంచి విరామం తీసుకున్న కోహ్లీ మళ్లీ వన్డే జట్టులో పునరాగమనం చేశాడు. విండీస్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో రికార్డుల రారాజైన కోహ్లీ బద్దలు కొట్టేందుకు మరికొన్ని రికార్డులు అతని ముందు సిద్ధంగా ఉన్నాయి.
కెప్టెన్ కోహ్లీతో పాటుగా ధోనీ, రోహిత్‌లు కూడా మరికొన్ని రికార్డులు చేరుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా
కోహ్లీ ఇంకా 187 పరుగులు చేస్తే భారత్-విండీస్ వన్డే సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్(1573 పరుగులు)పేరిట ఉంది.

కోహ్లీకి ఇంకా 221 పరుగులు మాత్రమే
వన్డేల్లో పది వేల పరుగుల మైలు రాయి చేరుకోవడానికి కోహ్లీకి ఇంకా 221 పరుగులు మాత్రమే అవసరం. ఈ రికార్డును చేరుకుంటే అతను సచిన్(18,426), గంగూలీ(11,363), ద్రవిడ్(10,889), ధోని(10,123) సరసన చేరనున్నాడు.

ధోనీకి కావాల్సిన పరుగులు 101
వన్డేల్లో విండీస్‌పై 1000 పరుగులు పూర్తి చేయడానికి మాజీ కెప్టెన్ ధోనీకి కావాల్సిన పరుగులు 101. ధోని ఇప్పటికే శ్రీలంక, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లపై వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. ఇప్పుడు విండీస్‌పై ఆ రికార్డు సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు.

రోహిత్ 170 పరుగులు చేస్తే విండీస్‌పై:
శర్మ కూడా మరో 170 పరుగులు చేస్తే విండీస్‌పై 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు నమోదు చేస్తాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications