30న మూడో వన్డే: ధోనీ స్థానంలో రిషబ్ పంత్?
హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా వెస్టిండిస్‌తో కోహ్లీసేన మూడో వన్డేని అంటిగ్వాలో ఆడనుంది. ఈ నేపథ్యంలో రెండో వన్డే ముగిసిన తర్వాత టీమిండియా పోర్ట్ ఆఫ్ స్పెయిన్ నుంచి అంటిగ్వాకు బయల్దేరనుంది. రెండో వన్డేలో ఘనవిజయం సాధించిన తర్వాత కెప్టెన్ కోహ్లి మీడియాతో మాట్లాడాడు.
టీమిండియా ప్రస్తుతం వెస్టిండిస్ పర్యనటలో ఉన్న సంగతి తెలిసిందే. మూడో వన్డేలో యువ ఆటగాడు రిషబ్ పంత్‌ని తుది జట్టులో తీసుకునే అవకాశం ఉందని కోహ్లీ తెలిపాడు. వెస్టిండిస్‌తో జరిగే మూడో వన్డేలో జట్టులో మార్పులు ఉంటాయని కూడా విరాట్ కోహ్లీ సూచించాడు.

మూడో వన్డేలో పంత్‌కు ఛాన్స్
‘జట్టు కూర్పు విషయంలో ఏమేం మార్పులు చేయాలో మేం కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అంటిగ్వా మ్యాచ్‌లో జట్టులో మార్పులు చేసే అవకాశముంది. కొందరికి తుదిజట్టులో అవకాశం దొరకొచ్చు' అని కోహ్లీ అన్నాడు. వెస్టిండిస్‌తో ఆదివారం జరిగిన రెండో వన్డేలో కోహ్లీ సేన ఘన విజయం సాధించింది.

రహానే సెంచరీ
ఓపెనర్ రహానే సెంచరీతో చెలరేగగా, ధావన్, కోహ్లీ అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో భారత్ 43 ఓవర్లలో ఐదు వికెట్లకు 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. 311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్.. భారత్ బౌలర్ల దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.

105 పరుగుల తేడాతో భారత్ విజయం
దీంతో వెస్టిండిస్‌పై టీమిండియా 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. యువ బౌలర్ కుల్ధీప్ యాదవ్ 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. రెండో వన్డేలో భారత్ విజయం సాధించడంతో ఐదు వన్డేల సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉంది.

ఆ రికార్డుపై కోహ్లీ సంతోషం
ఫేస్‌బుక్‌లో ప్రధాని మోడీ తర్వాత అత్యధికమంది ఫాలో అవుతున్న వ్యక్తిగా తాను రికార్డు సొంతం చేసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు. మైదానంలో అద్భుతైమన ఆటతీరుని కనబర్చడం వల్లే ఇలాంటివి సొంతమవుతాయని కోహ్లీ వ్యాఖ్యానించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications