న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

20వేల పరుగులు: సచిన్, లారాల రికార్డుని బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

ICC Cricket World Cup 2019:Ind v WI,Virat Kohli Breaks Tendulkar And Lara Record
India vs West Indies: Virat Kohli Breaks Sachin Tendulkar and Brian Laras Record

హైదరాబాద్: మాంచెస్టర్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇటీవలే ఈ ప్రపంచకప్‌లో వన్డేల్లో అత్యంత వేగంగా 11వేల పరుగుల మైలురాయిని అందుకున్న విరాట్ కోహ్లీ బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా రికార్డును బద్దలు కొట్టాడు. తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని చేరుకున్న తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇప్పటి వరకు తక్కువ ఇన్నింగ్స్‌లో 20 వేల పరుగుల మార్కును చేరుకున్న వారిలో సచిన్, బ్రియాన్ లారాలు అగ్రస్థానంలో ఉన్నారు. 453 ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ ఆ మార్కును చేరుకోగా.... ఆ తర్వాత 468 ఇన్నింగ్స్‌లతో రికీ పాంటింగ్ ఉన్నాడు. అయితే, కోహ్లీ మాత్రం కేవలం 417 ఇన్నింగ్స్‌లోనే ఈ మార్క్‌ను అందుకున్నాడు.

మూడు ఫార్మాట్‌లు కలిపి

మూడు ఫార్మాట్‌లు కలిపి

అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్‌లు కలిపి ఇప్పటివరకు 19,963 పరుగులు పూర్తి చేసిన విరాట్‌ కోహ్లీ విండిస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 37 పరుగులు చేయడంతో అత్యంత వేగంగా 20వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

12వ క్రికెటర్‌గా అరుదైన గుర్తింపు

12వ క్రికెటర్‌గా అరుదైన గుర్తింపు

ఫలితంగా ఈ ఘనతను సాధించిన 12వ క్రికెటర్‌గా అరుదైన గుర్తింపు పొందాడు. విరాట్ కోహ్లీ 417 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకోనున్నాడు. కోహ్లీ వన్డేల్లో 11087, టెస్టుల్లో 6613, టీ20ల్లో 2263 పరుగులు చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన మూడో భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ అరుదైన గుర్తింపు పొందాడు.

20వేల పరుగుల మైలురాయిని

20వేల పరుగుల మైలురాయిని

కోహ్లీకి ముందు సచిన్‌ టెండూల్కర్‌(34,357), రాహుల్‌ ద్రవిడ్‌ల(24,208)లు మాత్రమే ఈ ఘనత సాధించారు. కాగా, 20వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్‌, లారాలకు 453 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా, రికీ పాంటింగ్‌కు 468 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.

Story first published: Thursday, June 27, 2019, 17:43 [IST]
Other articles published on Jun 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X