మూడో వన్డే: తీవ్రంగా శ్రమించిన కోహ్లీ, ధావన్ (ఫోటోలు)
హైదరాబాద్: ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం కోహ్లీసేన వెస్టిండిస్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. మూడో వన్డే కోసం టీమిండియా బుధవారం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. కెప్టెన్ కోహ్లీతో పాటు టీమిండియా ఆటగాళ్లు బుధవారం చెమటోడ్చారు. ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
ఈ సిరిస్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శిఖర్ ధావన్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా బౌలర్లు భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. బ్యాటింగ్ ప్రాక్టీస్ అనంతరం కెప్టెన్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోలను మనం చూడొచ్చు. ఇదిలా ఉంటే ఇరు జట్ల మధ్య జూన్ 30(శుక్రవారం) మూడో వన్డే జరగనుంది.
తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, ఆదివారం జరిగిన రెండో వన్డేలో వెస్టిండిస్‌పై టీమిండియా 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
భారత ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలు:
నెట్ ప్రాక్టీస్ అనంతరం రిలాక్స్‌గా కోహ్లీ
వెస్టిండిస్‌తో శుక్రవారం జరగనున్న మూడో కోసం టీమిండియా ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేశారు. నెట్ ప్రాక్టీస్ అనంతరం విరాట్ కోహ్లీ సేద తీరుతున్న దృశ్యం.
ధాటిగా ఆడుతున్న ఓపెనర్ శిఖర్ ధావన్
ఈ సిరిస్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఫామ్‌లో ఉన్న శిఖర్ ధావన్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
భువీ బౌలింగ్
బుధవారం టీమిండియా ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేశారు. ఇందులో భాగంగా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న పేసర్ భువనేశ్వర్ కుమార్.
ఉమేశ్ యాదవ్
బుధవారం టీమిండియా ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేశారు. ఇందులో భాగంగా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న పేసర్ ఉమేశ్ యాదవ్.
ప్యాడ్ కట్టుకుంటున్న ధోని
ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం కోహ్లీసేన వెస్టిండిస్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగే మూడో వన్డే కోసం కెప్టెన్ కోహ్లీ నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications