బ్రావో ఇంట్లో ప్రత్యేక విందుకు హాజరైన టీమిండియా (ఫోటోలు)
హైదరాబాద్: ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ ఆడేందుకు కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో భాగంగా గత శుక్రవారం జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, ఆదివారం జరిగిన రెండో వన్డేలో వెస్టిండిస్‌పై టీమిండియా 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తాజా విజయంతో ఐదు వన్డేల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య జూన్ 30న మూడో వన్డే ఆంటిగ్వాలో జరగనుంది. ఇదిలా ఉంటే రెండో వన్డే అనంతరం వెస్టిండిస్ ఆటగాడు డ్వేన్ బ్రావో ఆదివారం రాత్రి టీమిండియా ఆటగాళ్ల కోసం ప్రత్యేక విందు కార్యక్రమం ఏర్పాటు చేశాడు.
బ్రావో ఇంట్లో టీమిండియా సందడి
మ్యాచ్ ముగిసిన వెంటనే టీమిండియా ఆటగాళ్లు కోహ్లీ, రహానె, ధావన్ తదితరులు ఈ విందు కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోని ఓపెనర్ శిఖర్ ధావన్ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'బ్రావో నివాసంలో విలువైన సమయం గడిపాం' అని తన ట్విట్టర్లో ఓ ఫోటోని పోస్టు చేశాడు.
ధోనితో ఫోటో: పక్కనే బ్రావో తల్లి
అంతకుముందు డ్వేన్ బ్రావో నివాసానికి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన కుమార్తె జీవాతో కలిసి వెళ్లాడు. ఈ సందర్భంగా డ్వేన్ బ్రావో తన తల్లితో కలిసి ధోనీతో దిగిన ఫొటోని తన ఇనిస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘గత రాత్రి నా సోదరుడు తన అందమైన కుమార్తెతో కలిసి మరో తల్లితో చాలా విలువైన సమయాన్ని గడిపాడు' అని పోస్టు చేశాడు.
టీమిండియా పేసర్ భువీతో బ్రావో సెల్ఫీ
టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్‌తో వెస్టిండిస్ ఆటగాడు డ్వేన్ బ్రావో సెల్ఫీ.
సిరిస్ ప్రారంభానికి ముందు ధోనితో మాటామంతీ
వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా నెట్ ప్రాక్టీస్ చేస్తున్న చోటికి బ్రావో తన సోదరుడికి కలిసి వచ్చాడు. ఈ సందర్భంగా దిగిన ఫోటోని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఇదిలా ఉంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ధోనీ నేతృతంలోని చెన్నై సూపర్‌కింగ్స్ జట్టులో డ్వేన్ బ్రావో సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications