For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచ రికార్డుకు 37 పరుగుల దూరంలో విరాట్ కోహ్లీ

ICC Cricket World Cup 2019 : Virat Kohli 37 Runs Away From Huge World Record || Oneindia Telugu
India vs West Indies: Virat Kohli 37 Runs Away From Overtaking Sachin Tendulkar, Brian Lara to Bag World Record

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. ఇటీవలే ఈ ప్రపంచకప్‌లో వన్డేల్లో అత్యంత వేగంగా 11వేల పరుగుల మైలురాయిని అందుకున్న విరాట్ కోహ్లీ బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా రికార్డును బద్దలు కొట్టనున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మూడు ఫార్మాట్‌లు కలిపి

మూడు ఫార్మాట్‌లు కలిపి

అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్‌లు కలిపి ఇప్పటివరకు 19,963 పరుగులు పూర్తి చేసిన విరాట్‌ కోహ్లీ మరో 37 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 20వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. కోహ్లీ వన్డేల్లో 11087, టెస్టుల్లో 6613, టీ20ల్లో 2263 పరుగులు చేశాడు.

గురువారం విండిస్‌తో మ్యాచ్

గురువారం విండిస్‌తో మ్యాచ్

టోర్నీలో భాగంగా టీమిండియా గురువారం వెస్టిండిస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కి ఓల్డ్‌ ట్రాఫర్డ్‌ మైదానం ఆతిథ్యమిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఈ రికార్డును అధిగమిస్తాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. విండిస్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ ఈ రికార్డు సాధిస్తే, ఈ ఘనతను సాధించిన 12వ క్రికెటర్‌గా నిలుస్తాడు.

మూడో భారత క్రికెటర్‌గా కోహ్లీ

మూడో భారత క్రికెటర్‌గా కోహ్లీ

ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన మూడో భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ అరుదైన గుర్తింపు పొందుతాడు. కోహ్లీకి ముందు సచిన్‌ టెండూల్కర్‌(34,357), రాహుల్‌ ద్రవిడ్‌ల(24,208)లు మాత్రమే ఈ ఘనత సాధించారు. కాగా, 20వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్‌, లారాలకు 453 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా, రికీ పాంటింగ్‌కు 468 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.

416 ఇన్నింగ్స్‌ల్లోనే

416 ఇన్నింగ్స్‌ల్లోనే

అయితే, విరాట్ కోహ్లీ 416 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకోనున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. కోహ్లీ సెంచరీ సాధిస్తే చూడాలని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Story first published: Wednesday, June 26, 2019, 15:40 [IST]
Other articles published on Jun 26, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+