Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఉప్ప‌ల్‌లో తొలి టీ20: నేటి నుంచి టికెట్ల అమ్మకాలు.. కనీస ధర రూ. 800!!

India vs West Indies 1st T20i : Uppal Match Ticket Sales Starts From Today || Oneindia Telugu
India vs West Indies: Uppal T20I Match ticket sales start from today

హైదరాబాద్‌: బంగ్లాదేశ్ పర్యటనను ఘనంగా ముగించిన కోహ్లీసేన స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు సిద్దమవుతోంది. డిసెంబర్ 6న ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ హైదరాబాద్‌ నగరం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగనుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం కాకుండా.. తొలి టీ20, మూడో టీ20 మ్యాచ్ వేదిక‌లలో బీసీసీఐ మార్పులు చేసిన విషయం తెలిసిందే.

ఉప్ప‌ల్‌లో తొలి టీ20:

ఉప్ప‌ల్‌లో తొలి టీ20:

తొలి టీ20 ముంబైలో డిసెంబర్‌ 6వ తేదీన జరగాల్సి ఉండగా.. ఆ మ్యాచ్‌ను హైదరాబాద్‌కు మార్చారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) విజ్ఞప్తి మేరకు తొలి మ్యాచ్‌ను ఉప్పల్‌లో నిర్వహించడానికి బీసీసీఐ ఒకే చెప్పింది. మూడో టీ20 (డిసెంబ‌ర్ 11న)కి ముంబై ఆతిథ్యం ఇవ్వనుంది. డిసెంబ‌ర్ 8న తిరువంతపురంలో రెండో టీ20 జరగనుంది.

కనీస ధర రూ. 800:

కనీస ధర రూ. 800:

ఉప్పల్‌లో జరిగే తొలి టీ20 మ్యాచ్‌ కోసం శుక్రవారం నుండి టికెట్ల అమ్మ కాలు ప్రారంభిస్తున్నట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌ ప్రకటించారు. టికెట్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. టికెట్ల ధరలను రూ.800, రూ.1000, రూ.1500, రూ.4000, రూ.5000, రూ.7500, రూ.10000, రూ.12500గా నిర్ణయించారు. టికెట్ కనీస ధర రూ. 800 కాగా.. గరిష్ట ధర రూ.12500గా ఉంది.

నా అధ్యక్షతన తొలి మ్యాచ్‌ ఇదే:

నా అధ్యక్షతన తొలి మ్యాచ్‌ ఇదే:

'ఉప్పల్‌ స్టేడియంలో డిసెంబర్‌ 11వ తేదీన జరగాల్సిన మ్యాచ్‌ను మా (హెచ్‌సీఏ) విజ్ఞప్తి మేరకు బీసీసీఐ 6వ తేదీనే నిర్వహిస్తోంది​. హెచ్‌సీఏలో నా అధ్యక్షతన తొలి మ్యాచ్‌ ఇదే. మైదానానికి వచ్చే క్రికెట్‌ అభిమానులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. పోలీస్‌ సెక్యూరిటితో పాటు ప్రైవేట్‌ సెక్యురిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాం' అని అజహర్‌ తెలిపారు.

రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం:

రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం:

ఈ పర్యటనలో భారత్, విండీస్ 3 టీ20లు, 3 వన్డే మ్యాచ్‌లు ఆడనున్నాయి. డిసెంబర్ 6న తొలి టీ20 మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగనుంది. రెండో టీ20 డిసెంబర్ 8న తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో, మూడో టీ20 డిసెంబర్ 11న ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో జరుగనుంది. అన్ని టీ20 మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతాయి.

Story first published: Friday, November 29, 2019, 8:18 [IST]
Other articles published on Nov 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+