
మీడియా ముందుకు కోహ్లీ:
జట్టు విదేశీ పర్యటనకు వెళ్లే ముందు మీడియా సమావేశాలు నిర్వహించడం సాధారణం. కోచ్, కెప్టెన్ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తారు. ఈ క్రమంలో కోహ్లీ కూడా పర్యాటనలో ప్రణాళికలు ఏంటి, జట్టు కూర్పు ఎలా ఉండబోతోంది అనే విషయాలు చర్చిస్తాడు. విండీస్ టూర్ కోసం సోమవారం సాయంత్రం టీమిండియా అమెరికాకు బయలుదేరుతుంది. టెస్ట్ జట్టు ఆటగాళ్లు, ఇప్పటికే ఇండియా-ఎ జట్టుతో వెస్టిండీస్‌లో ఉన్నవారిని మినహాయించి మిగతావారందరు ఈ రోజు ప్రయాణం చేస్తారు.

వార్తలకు ముగింపు పలికేనా:
ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓటమి అనంతరం కోహ్లీ, రోహిత్ విభేదాలపై ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలను సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ కొట్టిపారేశారు. అయితే కోహ్లీ భార్య అనుష్క శర్మను రోహిత్ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం.. విబేధాల మధ్య కోహ్లీ, రోహిత్‌లు ఇప్పటివరకు స్పందించకపోవడం ఈ వార్తలు నిజమే అని అందరూ భావిస్తున్నారు. ఈ రోజు జరిగే మీడియా సమావేశంలో కోహ్లీకి ప్రశ్నలు (రోహిత్‌తో విభేదాలు) ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో కోహ్లీ, రోహిత్‌పై వస్తున్న విభేదాల వార్తలకు ముగింపు లభిస్తుందేమో చూడాలి.

యూఎస్‌లో తొలి రెండు టీ20లు:
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల్లో భారత్ తలపడనుంది. తొలి రెండు టీ20లు యూఎస్‌లో జరగనున్నాయి. చివరి టీ20 సహా మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచులన్నీ వెస్టిండీస్‌లో జరుగుతాయి. మూడు ఫార్మాట్లకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ వేరువేరు జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications












