Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గెలిస్తే రికార్డే: అరుదైన ఘనతకు టాస్ దూరంలో కోహ్లీ

 India vs West Indies: Toss history awaits Virat Kohli in Thiruvananthapuram

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో అడుగుపెట్టాడంటే పరుగుల వరద పారాల్సిందే. అలాంటి కోహ్లీ ఇప్పుడు మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. అయితే ఈసారి కోహ్లీ రికార్డులు సృష్టించబోయేది అటు బ్యాటింగ్‌లోనో లేక ఫీల్డింగ్‌లోనో కాదు.

కోహ్లీ సాధించబోయే రికార్డు మ్యాచ్‌కు ముందు వేసే టాస్‌లో. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య తిరువనంతపురం వేదికగా గురువారం ఆఖరి వన్డే జరగనుంది. ఈ ఆఖరి వన్డేలో టాస్ గెలిస్తే విరాట్ కోహ్లీ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరనుంది.

నాలుగు మ్యాచ్‌ల్లో టాస్‌లు గెలిచిన కోహ్లీ

నాలుగు మ్యాచ్‌ల్లో టాస్‌లు గెలిచిన కోహ్లీ

ఇప్పటివరకు ఈ సిరీస్‌లో నాలుగు టాస్‌లనూ కోహ్లీయే గెలిచిన సంగతి తెలిసిందే. ఐదో వన్డేలోనూ టాస్ గెలిస్తే సొంతగడ్డపై జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించనున్నాడు. దీంతో పాటు ఓ సిరీస్‌లో వరుసగా ఐదు టాస్‌లు గెలిచిన నాలుగో భారత కెప్టెన్ అవుతాడు.

గతంలో ముగ్గురు మాత్రమే

గతంలో ముగ్గురు మాత్రమే

గతంలో అజహరుద్దీన్, మహేంద్ర సింగ్ ధోనీ, రాహుల్ ద్రవిడ్‌లు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇక, వెస్టిండిస్‌ జట్టుపై ఇలా వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో టాస్‌లు గెలిచిన కెప్టెన్లలో హ్యాన్సీ క్రోనే(దక్షిణాఫ్రికా), స్టీవ్ వా(ఆస్ట్రేలియా) ఉన్నారు. కాగా, ఇంగ్లాండ్ పర్యటనలో వరుసగా ఐదు టాస్‌లు ఓడి అమర్‌నాథ్, కపిల్‌ దేవ్ సరసన కోహ్లీ నిలిచిన సంగతి తెలిసిందే.

అరుదైన రికార్డు ముంగిట కోహ్లీ

అరుదైన రికార్డు ముంగిట కోహ్లీ

అయితే, సొంతగడ్డపై విండిస్‌తో జరుగుతున్న సిరిస్‌లో దానికి పూర్తి భిన్నంగా అరుదైన రికార్డు ముంగిట కోహ్లీ నిలవడం విశేషం. ఇంగ్లాండ్ పర్యటనలో "నేను టాస్ గెలవాలంటే రెండు వైపులా హెడ్స్ ఉండాలేమో" అని నిరాశ వ్యక్తంచేసిన కోహ్లీ ఈ పర్యనటలో మాత్రం వరుసగా టాస్‌లు గెలుస్తున్నాడు.

ఓ అరుదైన రికార్డు భారత ఖాతాలో

ఓ అరుదైన రికార్డు భారత ఖాతాలో

ఇదిలా ఉంటే, తిరువనంతపురంలో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే... ఓ అరుదైన రికార్డు భారత ఖాతాలో చేరుతుంది. 2015 నుంచి ఇప్పటివరకు సొంతగడ్డపై ఆడిన వన్డే సిరీస్‌ను భారత్ కోల్పోలేదు. కాగా, ఈ సిరిస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, October 31, 2018, 18:38 [IST]
Other articles published on Oct 31, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+