Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మూడో అంపైర్‌కు నోబాల్‌ బాధ్యతలు.. భారత్‌-వెస్టిండీస్‌ సిరీస్‌ నుంచే ట్రయల్స్‌!!

India vs West Indies 2019 : Third Umpire Will Take Decision On No Balls During Ind Vs Wi T20i
India vs West Indies: Third umpire to call no-balls during IND vs WI T20Is

ముంబై: గతకొంత కాలంగా అంతర్జాతీయ క్రికెట్లో నో బాల్స్‌ను అంపైర్లు గుర్తించలేకపోతున్నారు. దీంతో వివాదాలు చెలరేగుతున్నాయి. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2019 సీజన్‌లో అంపైర్‌ రవి ముంబై ఇండియన్స్‌ పేసర్‌ మలింగ వేసిన బంతిని నోబాల్‌గా గుర్తించకపోవడంతో.. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. ఆ తర్వాతా నోబాల్స్‌ విషయంలో ఎన్నో వివాదాలు తలెత్తాయి.

21 ఫ్రంట్‌ఫుట్‌ నోబాల్స్‌

21 ఫ్రంట్‌ఫుట్‌ నోబాల్స్‌

ఇక బ్రిస్బేన్‌ వేదికగా జరిగిన పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా టెస్టులోనూ తప్పులు జరిగాయి. ఈ మ్యాచ్‌లో ఏకంగా 21 ఫ్రంట్‌ఫుట్‌ నోబాల్స్‌ను అంపైర్లు గుర్తించలేకపోయారు. దీనిపై ఆటగాళ్లు, బోర్డుల నుంచి ఒత్తిడి మొదలైంది. దీంతో ఫీల్డ్‌ అంపైర్ల నుంచి ఆ బాధ్యతలను మూడో అంపైర్‌కు అప్పగించేందుకు ఐసీసీ నిర్ణయించిందని సమాచారం తెలుస్తోంది. వచ్చే నెలలో భారత్‌-వెస్టిండీస్‌ టీ20 సిరీస్‌ నుంచే ట్రయల్స్‌ మొదలవుతాయని తెలుస్తోంది.

భారత్‌-వెస్టిండీస్‌ సిరీస్‌ నుంచే ట్రయల్స్‌

భారత్‌-వెస్టిండీస్‌ సిరీస్‌ నుంచే ట్రయల్స్‌

'కొన్ని నెలల పాటు నోబాల్స్‌ అంశాన్ని మూడో అంపైర్‌కు అప్పగించి ఐసీసీ ట్రయల్స్‌ నిర్వహించనుంది. డిసెంబర్‌ 6న ప్రారంభమయ్యే భారత్‌-వెస్టిండీస్‌ టీ20 సిరీస్‌ నుంచే ట్రయల్స్‌ మొదలవుతాయి' అని ఐసీసీ అధికార ప్రతినిధి ఓ జాతీయ మీడియాకు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

మూడో అంపైర్‌కు నోబాల్‌ బాధ్యతలు

మూడో అంపైర్‌కు నోబాల్‌ బాధ్యతలు

సెకను కాలంలోనే బౌలర్‌ క్రీజు బయట కాలుపెట్టడం, వెంటనే బంతి దిశ, ఎల్బీ, వైడ్ వంటివి గమనించడం కష్టమవుతోందని ఫీల్డ్‌ అంపైర్లు పేర్కొంటున్నారు. అందుకే నోబాల్‌ను గుర్తించే బాధ్యతలు మూడో అంపైర్‌కు అప్పగిస్తే బాగుంటుందనే చర్చ చాలాకాలం అంతర్గతంగా జరుగుతోంది.

ట్రయల్స్‌ విజయవంతమైతే

ట్రయల్స్‌ విజయవంతమైతే

అయితే ఇప్పటికే మూడో అంపైర్‌కు ఎక్కువ, సంక్లిష్టమైన బాధ్యతలు ఉన్నాయని మాజీ అంపైర్‌ సైమన్‌ టాఫెల్‌ వాదిస్తున్నాడు. డీఆర్‌ఎస్‌కు తోడుగా నోబాల్స్‌ బాధ్యత కూడా అప్పగిస్తే మూడో అంపైర్‌కు కష్టమని అభిప్రాయపడుతున్నాడు. ఒకవేళ ట్రయల్స్‌ విజయవంతమైతే.. 1992లో కేవలం రనౌట్లు తనిఖీ చేసేందుకు నియమించిన మూడో అంపైర్‌ నోబాల్స్‌ సైతం గుర్తించాల్సి ఉంటుంది

Story first published: Tuesday, November 26, 2019, 11:09 [IST]
Other articles published on Nov 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+