For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs West Indies: ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్స్‌ను గుర్తించే బాధ్యతను థర్డ్‌ అంపైర్‌దే

India vs West Indies: Third umpire to call front-foot no-balls in the T20Is, ODIs


హైదరాబాద్: గత కొంత కాలంగా ఫీల్డ్‌ అంపైర్లు నో బాల్స్‌ను గుర్తించడంలో విఫలమవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్స్‌ను గుర్తించే బాధ్యతను థర్డ్‌ అంపైర్‌కే అప్పగిస్తున్నట్లు ఐసీసీ గురువారం అధికారిక ప్రకటన చేసింది.

ప్రస్తుతం భారత్-విండిస్ జట్ల మధ్య 3 టీ20లు, 3 వన్డేల సిరిస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో దీనిని ట్రయల్‌ రన్ కింద చేయనున్నట్లు ఐసీసీ తెలిపింది. మూడు టీ20ల సిరిస్‌లో హైదరాబాద్ వేదికగా జరిగే తొలి టీ20లో ఈ కొత్త కొత్త నిబంధనను అమలు చేయనున్నట్లు ఐసీసీ పేర్కొంది.

"ఈ నిబంధన ప్రకారం థర్డ్‌ అంపైర్‌ ఫ్రంట్‌ ఫుట్‌ బాల్‌ నోబాల్స్‌ను గుర్తించి ఫీల్డ్‌ అంపైర్‌కు సూచిస్తాడు. అదేవిధంగా థర్డ్‌ అంపైర్‌తో చర్చించకుండా ఫీల్డ్‌ అంపైర్‌ నోబాల్స్‌ను ప్రకటించకూడదు. ఒక వేళ బ్యాట్స్‌మన్‌ ఔటైన బంతి నోబాల్‌ అని థర్డ్‌ అంపైర్‌ ప్రకటిస్తే ఫీల్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి" అని ఐసీసీకి చెందిన ఓ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఈ ఒక్క నిబంధన మినహా ఫీల్డ్‌ అంపైర్‌కు ఉండే విధులు, బాధ్యతలు అలాగే కొనసాగుతాయని ఐసీసీ స్పష్టం చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో గత కొంతకాలంగా నో బాల్స్‌ అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇటీవలే ఆసీస్-పాక్ జట్ల మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో ఏకంగా 21 ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్స్‌ను ఫీల్డ్‌ అంపైర్లు గుర్తించలేకపోయారు.

దీంతో ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్స్‌ను గుర్తించే బాధ్యతను థర్డ్‌ అంపైర్‌కే అప్పగించాలని ఐసీసీ భావించి ఈ నిర్ణయం తీసుకుంది. భారత పర్యటనలో భాగంగా వెస్టిండిస్ జట్టు 3 టీ20లు, 3 వన్డేల సిరిస్ ఆడనుంది. ఇందులో భాగంగా తొలి టీ20కి హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. డిసెంబర్ 8న జరిగే రెండో టీ20కి తిరువనంతపురం ఆతిథ్యమిస్తుండగా... డిసెంబర్ 11న జరిగే మూడో టీ20కి ముంబై ఆతిథ్యమివ్వనుంది.

Story first published: Thursday, December 5, 2019, 18:43 [IST]
Other articles published on Dec 5, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+